గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గోరంట్లలో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాన్ని పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలు, ర్యాంప్ లు, డ్రైన్ల పై ఆక్రమణలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులకు సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. భవనాలు నిర్మాణ దశలోనే వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. ప్రదానంగా సెట్ బ్యాక్ పోర్షన్ లో ఏ విధమైన నిర్మాణాలు చేయకూడదని, జనరేటర్లు కూడా పెట్టడానికి వీలు లేదన్నారు. గ్రీనరీకి ప్లాన్ లో చూపిన విధంగా ఉండాలన్నారు. వాచ్ మెన్ రూమ్ నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ నిర్వాహకులే డ్రైనేజి లైన్ ను మేజర్ డ్రైన్ వరకు కనెక్ట్ చేసుకోవాలన్నారు. పర్యటనలో అసిస్టెంట్ సిటి ప్లానర్ మల్లికార్జున, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …