-ప్రతి శుక్రవారం నిర్వహించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు
-ప్రణాళిక విభాగం లో ఉదయం 10 గంటలకు అర్జీ దారులు హాజరై పరిష్కరించుకోవాాలి
-రుడా విసి కేతన గార్గ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాముల మేరకు రుడా పరిధిలో గల ఎవరైనా భవన నిర్మాణ (బిల్డింగ్ ప్లాన్స్ ) మరియు ల్యాండ్ డెవలప్ మెంట్ (లే అవుట్ ) కొరకు అర్జీలు దాఖాలు చేసినవారు, ప్రణాళిక విభాగమునకు సంబంధించిన సమస్యల పరిష్కారము కొరకు తగిన పత్రాలతో హజరు కావాలని రుడా వైస్ ఛాన్సలర్ కేతన గార్గ్ బుధవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. భవనం ప్లాన్, ల్యాండ్ అభివృద్ది కి చెందిన యొక్క ఫైల్ కు సంబంధించిన వివరములతో ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి రుడా కార్యాలయము నందు జరుగు “ఓపెన్ ఫోరమ్” కు హాజరై, సందేహములు నివృత్తి చేసుకొవాలన్నారు. సత్వరం దరఖాస్తులను పరిష్కరించుటకు కావలిసిన సమాచారమును తీసుకొని వచ్చిన యెడల మీ దరఖాస్తును త్వరిత గతిన పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకొవడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున, ఈ అవకాశమును అందరు సక్రమముగా వినియోగించు కోవలసిందిగా ఆయన కోరారు.