Breaking News

ఈవీఎం గోడౌన్ వద్ద నిరంతర పటిష్ట భద్రత ఉండాలి

-ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24×7 నిరంతరం పటిష్టమైన నిఘా, భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మార్గదర్శకాలు ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్ర పరచబడిన ఈవీఎం గోదామును బుధవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఎన్నికల రోజున పోలింగ్ జరుగుచున్నపుడు సక్రమంగా పని చేయని 66 ఈవీఎం లను గోడౌన్ లో ఉంచిన వాటిని బెల్ కంపెనీకి భద్రత నడుమ పంపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఆర్డీవో శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి, ఈవిఎం గోడౌన్ ఇంఛార్జి మరియు ఎస్డిసి సుధారాణి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, రేణిగుంట తాసిల్దార్ సురేష్, ఎలెక్షన్ సెల్ పవన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి ప్రతినిధి మనోహరాచారి, కాంగ్రెస్ ప్రతినిధి చిరంజీవి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *