-నిందితుడు వద్ద నుండి Rs.26 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు (349 గ్రాముల) మరియు నగదు Rs.1 లక్ష రూపాయలు స్వాధీనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది.10.10.2024 వ తేదీన విజయవాడ ప్రసాదంపాడు, రవీంద్ర భారతి స్కూల్ ఎదురుగా, BMPS రోడ్, M.S అపార్ట్మెంట్ కి చెందిన ఫిర్యాది తన ఇంటిలో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు పటమట పోలీస్ వారు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఫిర్యాది తన కుటుంబ సభ్యులు అందరూ రాత్రి భోజనం చేసి 09.30 గంటల సమయం లో నిద్రపోయి ఉదయం 07.30 గంటలకు నిద్ర లేచి చూడగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ లో నుంచి మెయిన్ డోర్ యొక్క టవర్ బోల్ట్ తీసి, మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి, బెడ్ రూమ్ కప్ బోర్డ్ లో ఉన్న రెండు బంగారు నాను తాడులు, రెండు జతల బంగారు చెవి దిద్దులు, నగదు Rs.2,22,000/- రూపాయలు దొంగతనం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలి చేయడం జరిగింది. సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.
ఈ నేపధ్యంలో దొంగతనం కేసులను త్వరితగతిన చేదించి నిందితులను అరెస్ట్ చేయాలని * నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ ఆదేశాల మేరకు, డీసీపీ క్రైమ్స్ కే.తిరుమలేశ్వర రెడ్డి ఐపిఎస్, సూచనలతో, క్రైమ్ ఏ.డి.సి.పి. ఎం. రాజా రావు పర్య వేక్షణలో, క్రైమ్ ఏ.సి.పి. Ch.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లో, సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్, ఎస్. వి.వి లక్ష్మి నారాయణ వారి సిబ్బందితో కలిసి సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిచుకుని అనుమానితులు మరియు పాత నేరస్తుల కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
దర్యాప్తు బృందాలకు రాబడిన సమాచారం మేరకు ఈ రోజు పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్, ఏలూరు రోడ్ కలిసే దగ్గరలో ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించగా అతని పేరు కంచర్ల మోహన్ రావు @ మోహన్ @ రాజు, S/o సుబ్బారావు (లేట్), వయసు 45 సవంత్సరాలు, కులం-ఎస్సీ మాల. స్వగ్రామం గవర్నమెంట్ స్కూల్ దగ్గర, కసుకూరు గ్రామం, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా. ఇతను ప్రస్తుతం మరువాడ గ్రామం, తుని మండలం, కాకినాడ జిల్లా లో నివశిస్తున్నట్లు విచారణలో తేలింది.
విచారణలో ఇతను పాత నేరస్తుడు, ఇతని పై విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, Dr.B.R అంబేద్కర్ కోన సీమ జిల్లా, రాజమండ్రి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ లో సుమారు 40 కి పైగా కేసులు కలవు, పలు మార్లు జైలు కి వెళ్లి వచ్చాడు. ఇతను గంజాయి త్రాగడం, మద్యం సేవించడం చెడు వ్యసనాలకు బానిస అయ్యారు. పగటి సమయంలో ఇళ్ళపై రెక్కి నిర్వహించి రాత్రి సమయాలల్లో దొంగతనం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇతను ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ లోని పటమట పోలీస్ స్టేషన్ పరిధి లో రెండు దొంగతనాలు, ప్రకాశం జిల్లా, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక దొంగతనం, పల్నాడు జిల్లా, చిలకలూరి పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, Dr.B.R అంబేద్కర్ కోన సీమ జిల్లా, అమలాపురం లో ఒక దొంగతనం, ప్రకాశము జిల్లా, దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం మరియు బాపట్ల జిల్లా, అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేయడం జరిగిది. ఇతని వద్ద నుంచి Rs.26 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు (349 గ్రాముల) మరియు నగదు Rs.1 లక్ష రూపాయలు స్వాధీన పరుచుకొని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్, క్రైమ్ డి. సి. పి తిరుమలేశ్వర రెడ్డి ఐ. పి. ఎస్., క్రైమ్ ఏ. డి. సి. పి. ఎం. రాజారావు, సి. సి. ఎస్. ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.