విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవాని దీక్ష విరమణ సందర్బంగా అన్ని విధములుగా సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల వారికి స్వచ్ఛంద సంస్థల వారికి, మీడియా ప్రతినిధులు, ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
విజయవాడ నగరంలో జరిగిన భవాని దీక్షల విరమణ ముగింపు సందర్భంగా గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నందు ఇతర జిల్లాల నుండి భవాని దీక్ష విరమణ బందోబస్త్ నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులతో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ ఓ గారు మాట్లాడుతూ…. ఈ భవాని దీక్షలు విజయవంతం చేయడం లో కీలకంగా వ్యవహరించిన పోలీస్ కమీషనర్ కి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసారు. ఈ భవాని దీక్ష యాప్ వలన సూదూర ప్రాంతాల నుండి వచ్చిన భవాని భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అమ్మవారి దర్శనం ముగించుకుని విరుముడిని సమర్పించుకున్నారు. ఈ సారి ఎటువంటి చిన్న సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం ముగిసిందని, భవాని దీక్ష విరమణ బందొబస్త్ కు వచ్చిన అధికారులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. ఈ సారి భవాని దీక్షల కార్యక్రమం విజయవంతంఅవడానికి ముఖ్య కారణం హోల్డింగ్ ఏరియా, ఈవో కి మనం ఏది అయితే చెప్పామో దానికంటే బాగా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసారు కావున టెంపుల్ ఈ.ఓ.ని అధికారులను అభినందిస్తున్నాను, అదేవిధంగా ఈ క్రమంలో భవాని దీక్ష యాప్, చైల్డ్ మానిటరింగ్ సిస్టం యాప్, అస్త్రం మొదలైన యాప్ ల ద్వారా మానిటరింగ్ చేయడం వలన మరియు దర్శనాలను కొంచెం త్వరితగతిన ప్రారంబించడం వలన ఎక్కడా భవానీలు ఆగకుండా దర్శనం చేసుకున్నారు. ఈ సారి కొత్తగా గిరిప్రధక్షణ అనంతరం రధం సెంటర్ నుండి వినాయక టెంపుల్ కు వచ్చి క్యూలైన్ లో కలవాలి కాని ఈ సారి రధం సెంటర్ వద్ద ఓపెన్ చేసి క్యూలైన్ లలోకి పంపడం వలన ఇంకా చాలా వరకు భక్తుల రద్దీ అనేది ఎక్కడా కనిపించలేదు. కమాండ్ కంట్రోల్ లో అన్ని శాఖల సిబ్బంది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వలన చాల విజయవంతం అయ్యింది. ఈ ఐదు రోజుల జరిగిన భవాని దీక్ష విరమణ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్వా నగర ప్రజలకు ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తూ, ఎక్కడా కూడా దొంగతనాలు జరుగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు అస్కారం లేకుండా అంకిత భావంతో, బాధ్యతగా విధులు నిర్వహించి, భవానిదీక్ష విరమణ కార్యక్రమానికి విజయ వంతంగా నిర్వహించుటలో తోడ్పాటు నందించిన దేవాదాయశాఖ, రెవిన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలవారికి మరియు ప్రజా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల వారికి, భవానీ భక్తులకు, మీడియా ప్రతినిధులకు మరియు అన్ని విభాగాల వారికి, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులకు, లోకల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఇతర జిల్లాల నుండి భవాని దీక్ష విరమణ బందోబస్త్ నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులకు మరియు లోకల్ అధికారులకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. శ్రీ కనకదుర్గ అమ్మవారి శేష వస్త్రం, ఫోటో మరియు లడ్డు ప్రసాదం అందించి అభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., డి.సి.పి.లు గౌతమీ షాలి ఐ. పి. ఎస్., తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్., ఉమామహేశ్వర రాజు ఐ.పి.ఎస్.,ఎ.బీ.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ట్రైనీ ఐ. పి. ఎస్. మనీషా, ఏ.డి.సి.పి. గుణ్ణం రామ కృష్ణ, ఏ. వి. ఎల్ ప్రసన్న కుమార్, టెంపుల్ ఈ ఓ కె. ఎస్. రామారావు, బందొబస్త్ కు వచ్చిన ఇతర ఏ.డి.సి.పి.లు, ఏ.సి.సి.లు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.