Breaking News

బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి

-జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, ఎల్డీఎం విశ్వనాథ రెడ్డి, ఆర్బిఐ ఎల్ డి ఓ పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ జి. రాంప్రసాద్, వివిధ బ్యాంకు అధికారులుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 2 వ త్రైమాసానికి సంబంధించి వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ బ్యాంకర్లందరూ రుణాలను మంజూరు చేయడంతో పాటు నిర్దేశించబడిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కౌలు రైతు కార్డుదారులకు క్రాప్ లోన్ కి సంబంధించిన రుణాలను బ్యాంకర్లు సకాలంలో మంజూరు చేయాలనీ తెలిపారు. కౌలు రైతు కార్డు లను రెన్యువల్ చేసుకోవాల్సిన కౌలు రైతులను గుర్తించి రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి జాప్యం చేయరాదని తెలిపారు. బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యత గల పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యం మేరకు రుణాలను మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో ఫైనాన్సియల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీల పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. పీఎంపిబి మరియు పీఎం జె. జె బీ వై కింద వీటిపై విరివిగా అర్హులను నమోదు చేయవలసిందిగా తెలిపారు. అర్హులైన అందరికీ కొత్త రుణాలను మంజూరు చేయవలసిందిగా తెలిపారు. ప్రత్యేకించి స్టార్ట్ అప్ ఇండియా పై ప్రతి ఒక్క బ్యాంకు వారు నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయవలసినదిగా కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎల్డిఓ పూర్ణిమ డిజిటల్ లావాదేవిలను గ్రామీణ ప్రాంతాల్లో వారికి పూర్తి అవగాహన కల్పించి వారికి డిజిటల్ పేమెంట్ చేసుకొనుటకు వారిని ప్రోత్సహించాల్సిందిగా బ్యాంక్ అధికారులకు సూచించారు.

హౌసింగ్ లోన్ తీసుకున్న కస్టమర్ కి రూఫ్ టాప్ సోలార్ సిస్టం కింద రెండు లక్షల రూపాయలు లోన్ అమౌంట్ తీసుకున్న వారికి రూ. 78,000 సబ్సిడీ రూపంలో తిరిగి పొందగలరని ఈ సందర్భంగా ఎల్డీఎం తెలిపారు.

ఈ సమావేశంలో నాబార్డ్ డి.డి.ఎం సునీల్, డిఆర్డిఏ పిడి శోభన్ బాబు, మెప్మా పీడీ రవీంద్ర, డిడి డిఐసి మారుతి ప్రసాద్, పిడి ఏపీఎంఐపీ సతీష్, ప్రభుత్వ రంగ ప్రవేట్ రంగ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *