తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో గతంలో చర్చించిన పలు అంశాలపై తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఫాలో అప్ సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై గత దిశా సమావేశంలో చర్చించిన అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై శాఖల వారీగా వారు చేపట్టిన చర్యలపై సమీక్షించి కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించడంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలనీ సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, హౌసింగ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, డ్వామా, మత్స్య శాఖ తదితర శాఖల పురోగతిపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ జుబేదా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.