Breaking News

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 699

-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు..
-గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి బుధవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 47 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి మండలం, ముచ్చివోలు గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని మారుమూల ఉన్న ప్రాంత వాసులకు రెవెన్యూ సదస్సులు ఒక గొప్ప సువర్ణవకాశమని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా భూమి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల రెవెన్యూ, సచివాలయ మరియు సంబందిత అధికారులు పాల్గొని విజయవంతంగా రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. తిరుపతి జిల్లాలో మొదటి రోజు నుండి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 8003 అర్జీలు అందాయని నేడు రెవిన్యూ సదస్సుల ద్వారా 699 అర్జీలు వచ్చాయని అందులో హౌస్ సైట్స్ పై – 55, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ పై -53, క్యాస్ట్ వెరిఫికేషన్ – 15, రీ సర్వే పై -36, ల్యాండ్ గ్రాబింగ్ పై -2, ఆర్ ఓ ఆర్ పై -370, ఇతర విషయాలకు సంబంధించి 148 వచ్చాయని తెలిపారు. ఈరోజు వచ్చిన అర్జీలలో 15 అర్జీల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *