విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుష్ డిపార్ట్ మెంట్ లో ఏ.పి.పిఎస్.సీ ద్వారా మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద, హోమయోపతి) పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఈ నెల 30, 31 తేదీల్లో దృవపత్రాల పరిశీలన జరుగుతుందని ఉపసంచాలకులు జె. ధనుంజయరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 30 ఉదయం 10 గంటలకు, హోమియోపతి మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు విజయవాడలోని గొల్లపూడి లోని ఆయుష్ డిపార్ట్ మెంట్ హెడ్ ఆఫీస్ నందు హాజరుకావాల్సిందిగా కోరారు. అర్హత పొందిన అభ్యర్థులు దృవపత్రాల పరిశీలనకు తప్పనిసరిగా హజరై తగిన పత్రాలను సమర్పించవలసిందిగా కోరారు. అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరికి వచ్చిన వారు G.O.Ms.No. 142, HM&FW, dt: 04/07/2009 అనుసరించి తగిన పత్రాలను కూడా అదే రోజు సమర్పించాల్సి ఉంటుందని ఉప సంచాలకులు జె. ధనుంజయరావు తెలిపారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం
-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …