Breaking News

ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలి

-పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమించాలి
-ఎన్జీవో నేత ఎ. విద్యాసాగర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించేల చర్యలు తీసుకోనేల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ తెలిపారు.

ఏపీ ఎన్జీవో అసోసియేషన్ విజయవాడ నగర శాఖ కార్యవర్గ సమావేశం బుధవారం ఎన్జీవో హోమ్ నందు నగర అధ్యక్షుడు సిహెచ్ వి ఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలిసిన పెండింగు బకాయిలైన ఆరు విడతల కరువు భత్యం, పీఆర్సీ ఎరియర్స్ ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.ఉద్యోగుల ఆకాంక్ష మేరకు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణం ప్రదర్శిస్తుందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గదృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు.సాధ్యమైనంత త్వరలో ఉద్యోగుల బకాయిలను చెల్లించేలా కృషి చేస్తామన్నారు. పీఆర్సీ కమిటీకి కమిషన్ ను నియమించి నివేదికలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నివేదిక సమర్పించేలోపు ఉద్యోగులకు మధ్యంతర భృతిని చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడంలో ఉద్యోగులు మరింత సహకరించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ లో ఉద్యోగుల సభ్యత్వ నమోదు ఉద్యోగ సమాచారం చందాదారులను చేర్పించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాసాగర్ కార్యవర్గ సభ్యులకు సూచించారు.

నగర శాఖ అధ్యక్షుడు సిహెచ్ వి ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ లో విజయవాడ నగర శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జిల్లా రాష్ట్ర సంఘ నాయకుల ఆదేశాలు సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేయడంలోను ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలోను నగర శాఖ తనదైన ముద్ర వేసుకుందన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లో పటిష్టమైన నాయకత్వం అవసరమన్నారు. ఈ నెలాఖరికి ఖాళీ కానునున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఎ. విద్యాసాగర్ గారిని ఎన్నుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.త్వరలో ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.

సమావేశంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. సత్యనారాయణ రెడ్డి, పి. రమేష్, బి. సతీష్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు షేక్. నాజీరుద్దీన్, డీఎస్ఎన్ శ్రీనివాసరావు, బి. రాజశేఖర్, వివి ప్రసాద్, బి. మధుసూదనరావు, డి. రాజచౌదరి, ఖాసీం సాహెబ్, ఎం. శ్రీనివాసరావు, కెఆర్ఎస్ గణేష్, పి. శ్రీనివాసరావు, జి. వరప్రసాద్, కె. శివ శంకర్, నాగరాజు, ఎం. రాంబాబు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్ ప్రజల దాహం తీర్చే అమృతధార కురిపిద్దాం

-గత ప్రభుత్వంలో చేసిన జల్ జీవన్ మిషన్ పనులన్నీ నిరూపయోగం -కేరళ రూ. 45 వేల కోట్లు కోరితే, ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *