-బాధిత కుటుంబం కళ్లల్లో ఆనందం….
-ముఖ్యమంత్రి హామీ మేరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 3 సం. పాపకు రూ 2 లక్షల రూపాయల చెక్కు అందజేసిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు మండలం గోసాల పంచాయతీ పరిధి వైకుంటపురం గ్రామానికి చెందిన గొట్టుపల్లి నాగరాజు, రాజేశ్వరి దంపతులకు 3 సంవత్సరాల వయస్సు గల రెండో కుమార్తె తనయ కిడ్నీ, లివర్ సంబంధిత తీవ్ర జెనెటిక్ అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా, శుక్రవారం ఈడుపుగల్లులో జరిగిన రెవెన్యూ సదస్సు సమావేశంలో ఈ దంపతులు ముఖ్యమంత్రిని కలిసి తమ పాపను ఆదుకోవాలని కోరగా ముఖ్యమంత్రి హామీ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం కలెక్టరేట్లో పాప వైద్యం కోసం రు.2 లక్షల రూపాయల చెక్ పాప తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు తమ కుమార్తెకు ప్రత్యేక వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వం ద్వారా పింఛను మంజూరు చేయించాలని కలెక్టర్ ను కోరగా, వీరితో దరఖాస్తు చేయించాలని కలెక్టర్ తమ వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. పాపకు కిడ్నీ, లివర్ సంబంధిత జెనెటిక్ ఆరోగ్య సమస్య కారణంగా 3 సంవత్సరాల నుండి ఎదుగుదల లేక తమ కుమార్తె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని, ప్రతినెల మందులు, వైద్యానికి 10 వేల రూపాయలు వ్యయం అవుతున్నదని, ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు పాప తల్లిదండ్రులు తెలిపారు.