Breaking News

పూర్ణాహుతితో అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ముగింపు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శాకంభరీ ఉత్సవములలో మూడవ రోజు (చివరి రోజు) శనివారం వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం 08 గం.ల నుండి సప్త శతి హవణము, మహావిద్యా పారాయణము, శాంతి పౌష్టిక హొమము నిర్వహించిన అనంతరము ఉ.11 గం.లకు పూర్నాహుతి, కూష్మాండ బలి, మార్జనము కలశోద్వాసన, ఆశీర్వాదము కార్యక్రమములు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమము నందు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వర రావు కుటుంబం, ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు దంపతుల వారు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ , పాలకమండలి సభ్యులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమములు నిర్వహించారు. పూర్ణాహుతి సమర్పించడముతో అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు విజయవంతముగా ముగిసినవని ఆలయ వైదిక కమిటీ సభ్యులు వారు తెలిపారు. దేవస్థానము నందు గర్భాలయము, అంతరాలయము, మరియు ప్రధానాలయము వివిధ రకముల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించబడినది. శాకంభరీ ఉత్సవముల సందర్భముగా భక్తులందరికీ కదంబం ప్రసాదముగా పంచిపెట్టబడినది.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *