విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 వ తేదీ సోమవారం కోవిడ్ వాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. మొదటి డోస్ వేసుకొనని గర్భిణిలు ,బాలింతలు, ఉపాద్యాయులు, సిబ్బంది నర్సింగ్ శానిటేషన్ సిబ్బంది ఇతర హెల్త్ కేర్ వర్కర్స్ కు మొదటి విడత టీకా అందించబడుతుందన్నారు. మొదటి విడత డోస్ వేయుంచుకొని రెండవ డోస్ కు అర్హులైన వారందరికీ రెండవ డోస్ కోవిడ్ టీకా వేయడం జరుగుతుందన్నారు. కావున అర్హులైన వారందరు తమ సంబంధింత వాలంటీర్లు,వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్ ను సంప్రదించి కోవిడ్ టీకా వేయుంచు కోవాలని కలెక్టర్ జె. నివాస్ ఆ. ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
పిచ్చి తుగ్లక్ చర్యల్లో జగన్ రెడ్డి మరో మైలురాయి దాటారు
-తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారు -ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిదే …