-ప్రతి మహిళా దిశా అప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
63 వ డివిజన్లో, విశాలంద్ర కాలనీ, సుందరయ్య నగర్లో గురువారం సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, 63 వ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, 62వ డివిజన్ కార్పొరేటర్ ఆలంపూరు విజయలక్ష్మి తో కలసి పాల్గొన్నారు. మంచి నీటి సరఫరా అభివృద్ధి కొరకు శిలా ఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థతో పాటు పలు వ్యవస్థలు నిర్లక్షానికి గురిఅయ్యాయని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పనులని సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేసుకుంటూ వస్తున్నారని అన్నారు. సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నగర అభివృద్ధే ఎజెండాగా పెట్టుకుని పని చేస్తున్నాం అన్నారు.ప్రజా సమస్యలు గురించి కౌన్సిల్లో సమగ్రంగా చర్చిద్దాము అని చెప్పినాకూడా వినకుండా నగరంలో ఒకటి అరా సభ్యత్వం ఉన్న ప్రతిపక్షాలు కౌన్సిల్ ముందు ధర్నాలు చెయ్యడంపై మండిపడ్డారు. అనంతరం డివిజన్లో ఉన్న ఇంటింటికి వెళ్లి మహిళలందరికి దిశా అప్ డౌన్లోడ్ చేసుకోమని సూచించి దిశా అప్ వల్ల మహిళలకు ఉన్న ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో వాటర్ ఏఇ శ్రీనివాస్, వి ఎం సి అధికారులు, డివిజన్ కోఆర్డినేటర్ పసుపులేటి యేసు,సి హ్ రవి,నాగు,కాయల రవి తదితరులు పాల్గొన్నారు