విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
63వ డివిజన్లో రాజీవ్ నగర్, వృద్ధ ఆశ్రమం వద్ద గురువారం జరిగిన దిశ అప్లికేషన్ మీద అవగాహన సదస్సు కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్, 62వ డివిజన్ కార్పొరేటర్ ఆలంపూరు విజయలక్ష్మి తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు. దిశ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చెయాలి, దాన్ని ఉపయోగించిన తరువాత ఎంత సమయంలో పోలీసులకు సమాచారం అందుతుందనే విషయాలు తెలియజేశారు. ఈ దిశా అప్లికేషన్ అవగాహన సదస్సు కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ప్రతి క్లస్టర్లోను వారి పరిధిలో ఉన్న మహిళలు ఎంత మంది మహిళలు స్కూలుకి వెళ్తున్నారు. ఎంతమంది మహిళలు ఉద్యోగాలకి వెళ్తున్నారు. నిత్యం బయటకు వచ్చే మహిళలు ఎంత మంది ఉన్నారో పూర్తి వివరాలు సచివాలయ సిబ్బంది దగ్గర ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సచివాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సచివాలయ మహిళా పోలీస్లు, స్థానిక పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏఒక్క మహిళకి ఇబ్బంది కలగదని ఆయన అన్నారు. కార్యక్రమంలో సి ఐ హనీష్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది, డివిజన్ కోఆర్డినేటర్ పసుపులేటి యేసు,సి హ్ రవి,నాగు,కాయల రవి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …