విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని బందరు రోడ్డు ఇందిరగాంధీ స్టేడియం వద్దనున్న పుడ్ కోర్టు అధునికరణ పనులను వచ్చే నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను అదేశించారు. గురువారం కమిషనర్ అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం వేడుకలను స్టేడియం ఆవరణలో నిర్వహించనున్నందున ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు గాను ఫుడ్ కోర్ట్ ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
కెనాల్ వ్యూ పార్క్ పనులను పరిశీలించిన కమిషనర్…
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదురుగా కాలువ వెంబడి చేపటిన గ్రీనరి, అభివృద్ధి పనులు కమిషనర్ పరిశీలించారు. కెనాల్ వ్యూ పార్క్ లో సివిల్ పనులు పూర్తి చేయాలని, నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చే సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలతో తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, ఉద్యానవన అధికారి జె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.