Breaking News

పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే..

-పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయం..
-ఎంపీ కోటగిరి శ్రీధర్
-ఎమ్మెల్యే. డీఎన్నార్

కలిడింది, నేటి పత్రిక ప్రజావార్త :
పాలనను ఇంటింటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదేనని పేదవారికి అన్నివిధాల చేయూత నందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆదివారం కలిదిండి మండలం కాళ్లపాలెం గ్రామంలో నూతనంగా రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నారని, సంక్షేమ పథకాల పేరుతో డబ్బు ను దండగ చేస్తున్నారని అంటున్నారని ఇది సమంజసం కాదని అన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి పాలనను మీ ఇంటికి తెచ్చారని మీ పనులు మీ గ్రామంలోనే జరిగేలా సచివాలయ వ్యవస్థ తెచ్చారన్నారు. ఇప్పుడు ఆధునిక హంగులతో భవనాలు అందుబాటులోకి తెస్తున్నారన్నారు. పిల్లల్ని చదివించడం కోసం అమ్మఒడి డబ్బులు ఇవ్వడం దండగా లేక వారికి అన్ని సదుపాయాలతో నాడు నేడు భవనాలు.. సౌకర్యాలు.. కల్పించడం దండగా..ప్రజలకు చేయూత అందించడం దండగా..ప్రతిపక్షాలు చెప్పాలని అన్నారు. చెప్పినమాటను చెప్పినట్టు పాటిస్తూ అమలు చేస్తూ ప్రజల్లో పూర్తి నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నారు.నిత్యం ప్రజలకోసం ప్రజల్లో ఉంటూ ప్రజావసరాలు గుర్తించి పనిచేస్తున్న మీ శాసనసభ్యులు డి.ఎన్. ఆర్ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ శ్రీధర్ అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన కాళ్లపాలెం ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.కాళ్లపాలెం గ్రామాన్ని తానేమీ దత్తత తీసుకోలేదని,కాళ్లపాలెం గ్రామమే తనను దత్తత తీసుకుని దీవించిందని అన్నారు.గ్రామ సచివాలయ భవనం నిర్మాణానికి స్థలదాతలు అయిన పేటేటి వెంకన్న గారి కుటుంబానికి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా కోరుకొల్లు గ్రామపంచాయతీ 14 వ వార్డు సభ్యులు గొరిపర్తి ఏసుబాబు ఎంపీ శ్రీధర్ సమక్షంలో వై.సీ.పీ లో చేరారు.
కార్యక్రమంలోపీఆర్ డీఈఈ సురేష్, ఎఎంసి చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు , సర్పంచ్ పెటేటి స్వర్ణకుమారి, బొర్రా వెంకటలక్ష్మి,, జడ్పీటీసీ అభ్యర్థి బొర్రా సత్యవతి, ఎంపీపీ అభ్యర్థి చందన ఉమామహేశ్వరరావు,ఎంపీటీసీ అభ్యర్థి పెటేటి రామకృష్ణ, మండల వ్యవసాయం సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ, రాష్ట్ర మహిళా కార్యదర్శి నంబూరి శ్రీదేవి, చెన్నంశెట్టి కోదండరామయ్య, పెటేటి సత్యనారాయణ, పడబుక్కల మురళీ, సాగి చిన్నబ్బాయిరాజు, నున్న కృష్ణబాబు, పెటేటి రామపండు, చెన్నంశెట్టి నాగరాజు,గండికోట ఏసుబాబు చిట్టూరి బుజ్జి, పడవల శ్రీనివాస్, ఉల్లంకి నగేష్, జాన్ విక్టర్, పీతల రాజబాబు, తోకల జగన్మోహన్,సాన వెంకటరామారావు, మోకా రామకృష్ణ, తోకల సింగయ్య, పెటేటి సాయి కృష్ణ, ప్రసాద్, రమేష్, మేడిమి వెంకన్న, మురళీ, బత్తిన సుబ్బారావు, కొల్లాటి నాగరాజు, పీతల దొరబాబు, అయ్యప్ప, శ్రీనివాసరావు, దుగ్గిరాల రంగారావు, చెన్నంశెట్టి వెంకటరాజు,బాలాజీ, ఫణి ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

Check Also

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *