Breaking News

ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి సున్నిత విలియమ్స్

-ప్రశంసించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచమే గర్వించే విధంగా అంకితభావంతో ఆసయ సాధనకు 286 రోజులు అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా ముగించి ఈ తెల్లవారుజామున భూమికి సురక్షితంగా చేరుకున్న సునీతా విలియమ్స్ కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందనలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వ్యోమగామి యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకమని, అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలు ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తాయన్నారు. శాస్త్రీయ పరిశోధన పట్ల సునీత గారికి ఉన్న ఆసక్తి పట్టుదల కష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్యసహసాలు ప్రశంసనీయమన్నారు. ఇద్దరు వ్యోమగాములు భూమిని సురక్షితంగా చేరుకోవడం ఆనందాయకమాన్నారు. మహిళసంకల్పశక్తి,అంకితభావన్నీ చూసి ప్రపంచమే గర్విస్తుందినీ మంత్రి కొనియాడారు.
తొమ్మిది నెలల తర్వాత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరుకున్న భారత్ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా భారత్ మూలాలుగా ఉన్న సునీత విలియమ్స్ సాధించిన ఈ విజయం మన దేశానికే గర్వకారణమాన్నారు అంతరిక్ష రహస్యాల పరిశోధకులకు ఈయాత్రస్ఫూర్తినిస్తుందనీ,అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలు ఈ ప్రపంచానికి ఎంతో ఆదర్శమాన్నారు. మూడోసారి అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన స్త్రీ సంకల్పశక్తి, అంకితభావన్నీ చూసి ప్రపంచమే గర్విస్తుంది అని కొనియాడారు.భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యానానికి ఈ యాత్ర విజయం ఎంతో దోహదపడుతుందన్నారు. ఇలాంటి ప్రయాణాలు మానవాళి నిరంతర ప్రగతికి దోహదపడతాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నూతన ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేస్తాం

-వచ్చే 5 ఏళ్లలో 20 వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం -రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో భాగస్వాములుకండి – ‘ఇంటికో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *