విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం సందర్భంగా జనసేన ధార్మిక సేవ మండలి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం కనకదుర్గ నగర్ వద్ద నుంచి మంగళవాయిద్యాల తో వందలాది మందితో అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 25 మంది సభ్యులతో కనకదుర్గ అమ్మవారి ధార్మిక సేవ మండలి ప్రకటించడం అందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన నాదెండ్ల మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ప్రధానంగా ధార్మిక మండలి సభ్యులు అమ్మవారికి నిత్య కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో, అభివృద్ధి కార్యక్రమాల లో ఎటువంటి అవకతవకలు జరగకుండా, భక్తులకు సౌకర్యాలు ఇబ్బంది కలగకుండాగా, పర్వదినాల్లో భక్తులకు అధికారులు అవకాశం ఇస్తే సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటామని, అమ్మవారి ఆలయంలో వ్యాపారాత్మక కోణాన్ని పూర్తిగా తొలగించి ఆధ్యాత్మిక భావన అడుగడుగునా వెల్లివిరిసే విధంగా కృషి చేస్తామని, అమ్మవారి ఆలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటరీ అవినీతిని అరికట్టేందుకు పూర్తిగా కృషి చేస్తామని దుర్గ గుడి నుండి అవినీతి రాక్షసుల్ని పారద్రోలేoతవరకు జనసేన ధార్మిక సేవ మండలి నిరంతరం కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సేవ మండలి సభ్యులు 25 మంది నగర కమిటీ మరియు పోతిరెడ్డి.అనిత, కొప్పిశెట్టి .వెంకటేశ్వరరావు, మల్లెపూ. విజయలక్ష్మి, బోమ్ము .రాంబాబు, పిల్ల.వంశీ, కంది.రాజా, కెంబూరి.కృష్ణ, షేక్. ఐజా, కురాకుల.సురేష్, వేముల.వెంకటేష్, కృష్ణకుమారి, కొరగంజి .రమణ , బొట్ట. సాయి తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …