Breaking News

నిర్ణీత సమయంలోగా సేవలందించిన సచివాలయాలకు ఐ.ఎస్.వో సర్టిఫికెట్లు… :  మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత సమయంలోగా ప్రజలకు సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఐ.ఎస్.వో గుర్తింపు సర్టిఫికెట్లను అందజేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని 2, 9 వార్డుల్లోని వార్డు సచివాలయాలకు ప్రభుత్వం నుండి వచ్చిన ఐఎవో గుర్తింపు సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ జే నివాస్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ సమక్షంలో సచివాలయ ఉద్యోగులకు మంత్రి కొడాలి నాని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సీఎం జగన్మోహనరెడ్డి దూరదృష్టితో రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను తీసుకువచ్చారన్నారు. ఈ వ్యవస్థల ద్వారా ప్రజల ముంగిటకు ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్ళి అందించడం జరుగు తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను నిర్ణీత సమయంలోగా అర్హులైన పేదలకు అందిస్తున్నామన్నారు. గుడివాడ పట్టణంలో 2, 9 వార్డుల సచివాలయాలకు ఐ.ఎస్.వో గుర్తింపు లభించిందని, ఈ గుర్తింపు రావడానికి కృషి చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను మంత్రి కొడాలి నాని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండ్రు సునీత, వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పెయ్యల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, మొండ్రు వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మేకల సత్యనారాయణ, నందివాడ మండల అధ్యక్షుడు కొండపల్లి కుమార్‌రెడ్డి, పలువురు వ్యవసాయశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *