గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైతుభరోసా రథం ద్వారా రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయం ఎదుట రైతు భరోసా రథాన్ని జిల్లా కలెక్టర్ జే నివాస్ తో కలిసి మంత్రి కొడాలి నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మూడు నుండి నాలుగు రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు, సాంకేతిక నిపుణులతో రైతులు ఆన్లైన్ లో మాట్లాడుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతుభరోసా రథం ద్వారా వివరించడం జరుగుతుందన్నారు. సాగు చేస్తున్న పంటలకు సంబంధించి సలహాలు, సూచనలను అందిస్తారన్నారు. రైతు భరోసా రథంలోని డిజిటల్ స్క్రీన్ ద్వారా సాగు పద్ధతులపై మెళకువులను చలనచిత్ర రూపంలో వివరణాత్మకంగా ప్రదర్శిస్తారన్నారు. రైతు భరోసా రథంలో వ్యవసాయ అధికారితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అందుబాటులో ఉంటారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండ్రు సునీత, వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, పెయ్యల ఆదాం, మట్టా జాన్ విక్టర్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, మొండ్రు వెంకటేశ్వరరావు, వ్యవసాయ సలహా మండలి గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మేకల సత్యనారాయణ, నందివాడ మండల అధ్యక్షుడు కొండపల్లి కుమార్ రెడ్డి, పలువురు వ్యవసాయశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags gudivada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …