-వ్యవసాయ అనుబంథ శాఖల అధికారులు రైతు స్పందన లో వచ్చే సమస్యలు సత్వర పరిష్కారం..
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సమస్యలు పరిష్కరించేందుకు నెలలో ప్రతి మొదటి, చివరి బుధవారం రైతు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి రైతుస్పందన కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు(నాని) కలెక్టరు జె నివాస్,ఆర్డీవో శ్రీనుకుమార్, వ్యవసాయ అనుబంధశాఖ జిల్లాస్థాయి అధికారులు హాజరై రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెలా రెండు సార్లు మొదటి, చివరి బుధవారాల్లో రైతు స్పందన కార్యక్రమం జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో జరగుతుందన్నారు. ఇప్పటికే మొదటి శుక్రవారం వ్యవసాయ సలహా మండలి కమిటీ గ్రామస్థాయిలో రెండవశుక్రవారం మండల స్థాయిలో మూడవ శుక్రవారం జిల్లా స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతు ఎటువంటిఇబ్బందులకు గురుకాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిశ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రణాళికా బద్దంగా రైతు సమస్యలు పరిష్కరించే విధంగా రైతు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. రైతు స్పందనలో ఇతర సమస్యలు తేకుండా వ్యవసాయ వాటి అనుబంధరంగాలకు సంబందించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట సాగులో మెలకువులు వంటి అంశాలకు సంబందించి సమస్యలను పరిష్కరించడం జరుగతుందన్నారు. రైతు స్పందన కార్యక్రమంలో అధికారులు, రైతులు చిత్తశుద్దితో పాల్గొని రైతలు సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ రోజు గుడివాడ రూరల్ మండలం నుంచి 15 మంది రైతులు తమ సమస్యల పై అర్జీలు అందించారని వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని, కలెక్టరు జె. నివాస్ ఆధునిక టెక్నాలజితో రూపొందించిన రైతు భరోసా రథానికి జెండా ఊపీ ప్రారంభించారు.
గుడివాడ పురపాలక సంఘ పరిధిలోని 2,9 వార్డు సచివాలయలకు ప్రభుత్వం ప్రకటించిన ఐఎస్ఓ (మోడల్ సచివాలయాలుగా) గుర్తింపు సర్టిఫికెట్ ను , కమిషనర్ సంపత్ కుమార్ తో కలిసి సచివాలయ కార్యదర్శులకు అందజేస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కలెక్టర్ జె. నివాస్ అందజేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనుకుమార్, వ్యవసాయశా జేడీమోహనరావు, మత్స్యశాఖ జేడీ బాషా, వ్యవసాశాయ శాఖ ఏడీ రమాదేవి, ఏవో ఎస్.టి.ఆంజనేయులు,తాహశీల్థారుశ్రీనివాసరావు, యంపీడీవో ఏవిరమణ, వైసీపీ రాష్ట్ర స్థాయి నాయుకులు దుక్కిపాటి శశిభూషణ్, మార్కెట్ యార్డు చైర్ పర్శన్, వ్యవసాయ సలహా మండలి బోర్డు అధ్యక్షులు గుడివాడ మండలంలోని పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.