-ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకములో భాగంగా భూ పరిపాలనాధికారి వారి ఉత్తర్వులు మేరకు డివిజన్ పరిధిలోని గుడ్లవల్లేరు, పామర్రు మండలంలో 50 గ్రామాల్లో రీసర్వే నిమిత్తం గ్రామ సరిహద్దులు మరియు గ్రామ కఠము సరిహద్దులు నిర్ణయించుటకు గాను గ్రామ సర్వేయర్లు, పంచాయితీ కార్యదర్సులు , మండలసర్వేయర్లు మరియు గ్రామ పెవిన్యూ అధికారులు హజరు కానున్నారని ఆర్డీవో శ్రీనుకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీ సర్వేకు ఎంపిక చేసిన సరిహద్దులు నిర్ణయించిన తదుపరి డ్రోన్ ద్వారా సర్వే జరుపబడును. ఫ్రీ డ్రోన్ ఫ్లై కి ముందు తీసుకోవలసిన చర్యలు ముమ్మరం చేయాలన్నారు. గుడ్లవల్లేరు మండలం గల 24 గ్రామముల, పామర్రు మండలంలో 26 గ్రామాల్లో సరిహద్దులు, గ్రామ కంఠము సరిహద్దులు గుర్తించుటకు గాను గుడ్లవల్లేరు మండలం మరియు పామర్రు మండలంలో గల గ్రామ సర్వేయర్లు, పంచాయీతీ కార్యదర్శులు, గ్రామ రెవన్యూ అధికారులు వారికి నిర్థేశించి లక్ష్యాలను అనుసరిస్తూ భూమి పైన మార్కులను ఈ నెల 10 వ తేదీ లోగా పూర్తి చేయాలని సర్వే మరియు భూ పరిపాలనాధికారి ఉత్తర్వులు జారీ చేసియున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట్రాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు మరియు భూరక్ష పథకముు గత ఏడాది డిశంబరు 21వ తేదీన జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం క్రింద రాష్ట్రంలో 51 రెవిన్యూ డివిజన్లలో పైలట్ ప్రాజెక్టుగా 51 గ్రామాలను రీసర్వే, గ్రౌండ్ ట్రస్టిం గ్ వరకు పూర్తయినవి ఆర్డీవో శ్రీనుకుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.