ఆదివారం నాటికి 80 గ్రామ సచివాలయాలకు రెండవ పైకప్పు వేయాలి… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాలు వేగవంతం చేసే దిశగా 80 గ్రామ సచివాలయాలకు వచ్చే ఆదివారం లోపు రెండవ పైకప్పు వేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. బుధవారం స్థానిక రైతు శిక్షణా కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామ సచివాలయాలు, ఆర్ బికె, హెల్త్ క్లీనిక్స్ భవనాల నిర్మాణంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా ప్రగతి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనుల పురోగతిలో ఎటువంటి అలసత్వానికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. ఇక పై పనులను వేగవంతం చేయవలసిందేనన్నారు. పదేపదే చెప్పించుకొనే పరిస్థితిని తీసుకురావద్దని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయడమే అంతిమ లక్ష్యం కావాలన్నారు. జిల్లా ప్రగతి వచ్చే ఆదివారం నాటికి ప్రభుత్వ వెబ్ సైట్ లో కనిపించాలన్నారు. జిల్లాలో 809 గ్రామ సచివాలయాలకు భవానాలు నిర్మించాల్సి ఉండగా, 169 గ్రామ సచివాలయాలకు పనులే ప్రారంభించలేదని ఇంజనీర్ల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలానికి కనీసం రెండు చొప్పున 80 గ్రామ సచివాలయ భవనాలకు రెండవ పైకప్పు కచ్చితంగా వేసి ఫోటోలు తీసి ప్రభుత్వ వెబ్ సైట్ కు అప్లోడ్ చేయాలన్నారు. 32 భవనాలు భౌతికంగా పూర్తి అయ్యే దశలో ఉన్నాయని, వాటన్నింటినీ పూర్తి చేయమని ఆదేశించారు. జిల్లాలో 196 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాలని అయితే 80 రైతు భరోసా కేంద్రాలకు స్లాట్లు వేయాలని ఆదేశించారు. అలాగే 38 భవనాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 42 హెల్త్ క్లినిక్ లకు స్లాట్లు వేయాలని ఆయన ఆదేశించారు. 30 భవనాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వాటిని పూర్తి చేయమని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇంజనీర్ల వారీగా రెండవ పైకప్పులు, స్లాట్లు వేసే భవనాలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. ఇవి పూర్తి కాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జేసి (ఆసరా) కె.మోహన్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్స్ వీరాస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిఇలు, ఏఇలు హాజరయ్యారు.

Check Also

నూతనంగా వితంతువులకు పింఛన్లు మంజూరు – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం. -స్పౌజ్‌ కేటగిరి కింద కొత్తగా 5,402 మందికి పింఛన్లు మంజూరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *