Breaking News

డెప్యుటేషన్ కోరే ఉద్యోగులు మరో ఉద్యోగి వచ్చేలా చూడాలి : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పని చేసే చోటు నుంచి మరో ప్రాంతానికి డెప్యుటేషన్లు కోరే ఉద్యోగులు వారు ప్రస్తుతం పనిచేసే ప్రాంతానికి మరో ఉద్యోగి వచ్చేలా చూస్తే స్థానికంగ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కావని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. బుధవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
తొలుత మచిలీపట్నం నగరపాలక సంస్థకు చెందిన మహిళా ఉద్యోగిని మంత్రిని కలిసి తనకు వేరే ప్రాంతానికి డిప్యుటేషన్ ఇప్పించాలని కోరింది. ఈ విషయమై స్పందిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రాష్ట్రంలో బదిలీలు లేవని, మరో ఉద్యోగితో పరస్పర అంగీకారంతో డిప్యుటేషన్ చేసుకోవాలని సూచించారు . ఇక్కడ పోస్ట్ బ్లాక్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ ఇక్కడ జీతం పొందడం ఏమాత్రం ధర్మం కాదని మంత్రి అన్నారు. స్థానికంగా పనిచేసే అధికారులు అందుబాటులో లేకపోతే ఎన్నోకీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయని అన్నారు. ఉద్యోగుల విధులలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకొనని, అక్రమాలకు తన మద్దతు ఎన్నడూ ఉండదని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని తెలిపారు. తమకు నా అనేవాళ్ళు తమకు ఎవరూ లేరని, కొంతకాలం క్రితం పక్షవాతం వచ్చిందని తమ ఆలనా పాలనా చూసేవారు ఎవరూ లేరని తన భార్య ప్రభావతిని తనను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించాలని మంత్రి పేర్ని నానిని మామిడి రత్నాజీ రావు అనే వృద్ధుడు అభ్యర్ధించారు. స్థానిక గిలకలదిండికి చెందిన లంకె ముసలమ్మ అనే వృద్ధురాలు మంత్రికి తన బాధలను చెప్పుకొంది.50 వేల రూపాయల అప్పు చేసి తన బంధువుల దినకర్మ ఘనంగా గా నిర్వహించానని దీంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయని అప్పు తీర్చకపోతే చంపేస్తామని నరసాపురం నుంచి కొందరు బెదిరిస్తున్నారని ఆమె మంత్రి వద్ద విలపించింది. కరోనా వంటి కష్టకాలంలో అప్పులు చేసి మరీ ఆర్బాటంగా పెదకర్మలు జరపడం సరికాదని పదిమంది గోత్రీయులకు భోజనంపెడితే సరిపోతుందమ్మా, అంటూ నిన్ను ఎవరూ బెదరించకుండా పోలీసులకు చెబుతానులే వారి బాకీ నెమ్మదిగా తీర్చుకోమ్మా అంటూ ఆమెను మంత్రి ఓదార్చారు.
స్థానిక రాజుపేటకు చెందిన సుల్తానా అనే మహిళ తన సోదరితో వచ్చి మంత్రిని కలిసి తన చెల్లి పడుతున్న బాధలను వివరించింది. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన ఒక వ్యక్తికి లక్ష రూపాయలు కట్నం ఇచ్చి తమ పెద్దలు పెళ్లి చేశారని, పనిలోకి వెళ్లకుండా నిత్యం గంజాయి తాగుతూ, తనను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నడని తెలిపింది. గతంలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక పిల్లవాడికి తండ్రి అయ్యాడని, తమను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని గతంలోనే తనకు పెళ్లి అయిందని తమకు తర్వాత తెలిసిందని ఆమె వాపోయింది. తమకు సోదరులు ఎవరూ లేరని ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదని.. సర్దుకుపోయే అక్కడే ఉందామంటే తన భర్త హింసిస్తున్నాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేస్తే, నా మీద కంప్లైంట్ చేస్తావా అంటూపోలీస్ స్టేషన్ లోనే తన చేతిని గట్టిగా మెలిపెట్టి తిప్పి ఎముక విరగగొట్టెడని మంత్రికి సుల్తానా కట్టు కట్టిన తన చేతి ని చూపించి చి ఏడుస్తూ చెప్పింది. దీంతో స్పందించిన మంత్రి దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రాజీవ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి బాధితురాలికి తక్షణమే సహాయం చేయాలనీ ఆదేశించారు. అమ్మా మీరు దిశా పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి మీకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *