Breaking News

పర్యావరణ పరిరక్షణకు అటవీ సంపద అభివృద్ధికి మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం…

-ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా 49,731 హెక్టార్లలో ప్లాంటేషన్ చేపట్టాం…
-రాష్ట్రంలో అరకు, సూర్యలంక బీచ్ లో ఎకోటూరిజం సెంటర్ల ఏర్పాటు.
-రాష్ట్ర అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణకు అటవీ సంపదను కాపాడుటతో పాటు మొక్కల పెంపకాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా  మొండితోక అరుణ్ కుమార్ ను ప్రభుత్వం నియమించిందని దీనిలో భాగంగా విజయవాడ ఏ1 కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో గురువారం ఛైర్మన్ గా  మొండితోక అరుణ్ కుమార్ చేత రాష్ట్ర అటవీశాఖామంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి లుగా పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీశాఖామంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని దీనిలో భాగంగా అటవీ సంపద అభివృద్ధితోపాటు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ దాదాపు 50 వేల హెక్టార్లలో యూకలిప్టస్, వెదురు, జీడిమామిడి, కాఫీ, మిరియాలు మరియు టేకు తోటలు పెంచి రాష్ట్ర అటవీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నదని మంత్రి అన్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలకు నాణ్యమైన ముడిసరుకులను, సేవలను అందిస్తూ సంస్థ లాభాలను గడిస్తున్నదన్నారు. గిరిజనులకు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి జీవనోపాధి కల్పిస్తూ ఈసంస్థ అటవీ అభివృద్ధికి కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు. ఈ అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా 2019లో 89.58 కోట్లు, 2020లో 86.38 కోట్లు, 2021 సంవత్సరంలో ఇప్పటివరకూ 60.11 కోట్ల రూపాయలు అటవీ ఫలసాయాలు ద్వారా ఆదాయాన్ని ఆర్జించిందని మంత్రి అన్నారు. ఎకో టూరిజంను అభివృద్ధి చేయడానికి ముత్యాలపాలెం దగ్గర సూర్యలంక బీచ్, అనంతగిరి దగ్గర అరకులలో ఎకో టూరిజం సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అక్కడ నాచుర్ ఎడ్యుకేషన్ క్యాంపులను నిర్వహించడంతో పాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో యూకలిప్టస్, వెదురు, టేకు, కాఫీ, మొదలగు అటవీ సంపద అభివృద్ధికి సంస్థ ఇతోధికంగా కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భూమిలేని నిరు పేదలకు రిమోట్ ఏరియాలోని ప్రజలకు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 49731 హెక్టార్లలో అటవీ అభివృద్ధికి సంస్థ ద్వారా
ప్లాంటేషన్ చేపట్టామని వాటిలో 327 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టామని అటవీశాఖామంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యువకుడు
మొండితోక అరుణ్ కుమార్ ఈసంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించగలడని తెలియజేస్తూ ఈసందర్భంగా ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్ కు మంత్రి శ్రీనివాస రెడ్డి అభినందనలు తెలియజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి తన పై ఎంతో నమ్మకంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించుటలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాలు, ఎకోటూరిజం కార్యక్రమాలు చేపడతామని, సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని ఛైర్మన్ డా. మొండితోక అరుణ్ కుమార్ అన్నారు.
ముందుగా జ్యోతిని వెలిగించి ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రారంభించగా ఈకార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్రమంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని), ఆదిమూలపు సురేష్, డా. అనీల్ కుమార్ , వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఉమెన్ కమిషన్ ఛైర్మన్ వాస్ రెడ్డి పద్మ, ఏపి ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఛైర్మన్ గౌతంరెడ్డి, కృష్ణా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తన్నేటి నాగేశ్వరరావు, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, విజయవాడ
మేయరు రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, మెరుగు నాగార్జున, కె. రక్షణనిధి, దూలం నాగేశ్వరరావు, మొండితోక జగన్మోహనరావు, నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాయి దుర్గా ప్రసాదరాజు, అటవీ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బికె. సింగ్ , అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారి విశ్వజిత్ సింగ్  తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *