కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయ పరిచి ప్రజల సమస్య లు పరిష్కరించడం జరిగిందని కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మా రెడ్డి అన్నారు. కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి విశాఖపట్టణం మెట్రో పాలిటీ రీజియన్ డెవలప్మెంట్ అధా రిటీ ఎస్టేట్ అధికారిగా బదిలీ పై వెళుతున్న సందర్భం గా కొవ్వూరు డివిజన్ మండల తాహిసిల్దార్ లు, కొవ్వూరు ఆర్డీవో సిబ్బంది గురువారం రాత్రి ఆర్డీవో కి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ లు మాట్లాడుతూ ఆర్డీవో లక్ష్మారెడ్డి మార్గదర్శకత్వంలో డివిజన్ లో కోర్టు కేసులు సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఆయన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కోవిడ్ తొలి దశ లో ఉన్నప్పుడు చాలా ధైర్యం గా ఎదుర్కోవడం అభినందనీయమన్నారు. లక్ష్మారెడ్డి బదిలీ పై వీళ్ళడం చాలా బాధగా ఉన్న, కీలకమైన బాధ్యత లు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు. తనను విశాఖపట్నం మెట్రో పాలిటీ రీజియన్ డెవలప్మెంట్ అధా రిటీ ఎస్టేట్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు అందాయని లక్ష్మారెడ్డి అన్నా రు. గత ఏడాది మార్చి 7న ఆర్డీవోగా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించానని, కొవ్వూరు లో పనిచెయ్యడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. తనకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్డీవో ను , వారి కుటుంబ సభ్యుల ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఓ, జి.ఎస్.ఎస్. జవహర్ బాబాజీ రావు, తదితరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకి పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, …