-ఇదే స్పూర్తితో సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, వాలంటరీలు కృషి చేయాలి…
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వపరిపాలన, సుపరిపాలన కు శ్రీకారం చుడుతూ జగనన్న ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ నేడు ఐఎస్ఓ గుర్తింపు సాధించడం ఆనందదాయకమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఇటీవల తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన ఐఎస్ఓ సర్టిఫికెట్స్ ప్రధానోత్సవంలో కైకలూరు 1, పెంచికలమర్రు గ్రామాలు అందుకున్న ధ్రువపత్రాలను, ఈ రోజు శాసనసభ్యులు శాసనసభ్యులను కలసి వారి చేతుల మీదుగా సర్టిఫికెట్ లు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో రెండేసి చొప్పున 8 గ్రామ సచివాలయాలు ఐఎస్ఓ గుర్తింపు పొందాయన్నారు. కైకలూరు మండలం లో కైకలూరు 1, పెంచికలమర్రు సచివాలయాలకు మోడల్ గ్రామ సచివాలయాలుగా ఐఎస్ఓ సర్టిఫికెట్ లు రావడం సంతోషంగా ఉందన్నారు. అదేవిదంగా నియోజకవర్గంలోని ప్రతి సచివాలయం కూడా గుర్తింపు తెచ్చుకోవాలని, సచివాలయలలో కార్యదర్శిలు, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు,కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలోతాహశీల్థారు సాయికృష్ణకుమారి, కైకలూరు, పంచికలమర్రు సర్పంచ్ లు డీయం. నవరత్నకుమారి, జయమంగళ కాసులు, హోసింగ్ డీఈఈ ఆదినారాయణ, ఎన్ఆర్ఇడీఎస్. ఏపీఓ చరణ్, సెక్రెటరీలు లక్ష్మినారాయణ, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.