Breaking News

దళారి వ్యవస్థ ను పెంచి పోషించిన పార్టీ టీడీపీనే : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేలు,నాయకులు వారి బినామిలను దళారులు గా పెట్టుకొని ప్రతి సంక్షేమ పధకం అమలుకు ప్రజల వద్ద లంచాలు వసూలు చేసారని, ఆ నీచ సంస్కృతి టీడీపీ పార్టీ దే అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 18 వ డివిజిన్లో స్థానిక కార్పొరేటర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన 18 వ డివిజిన్ జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాలంటర్ లు, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వాటి పరిష్కారానికి తగు సూచనలు చేశారు. పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలు గురుంచి వినతిపత్రలు స్వీకరించారు. ఏవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వలన పధకం అమలు కాకపోతే ఈ పరిష్కార వేదికలో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు. డివిజిన్లో సీనియర్ నాయకులు గా వెంకట సత్యం కి ప్రజా సమస్యల పట్ల విశేష అనుభవం ఉందని, ఏ నమ్మకం తో అయితే ప్రజలు ఆయన్ని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధముగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ,వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారంలో కానీ,వరదలు సమయంలో పర్యటించిన సమయంలో గాని ఇక్కడి ప్రజలు రిటైనింగ్ వాల్ పూర్తి చేయమని మమ్మల్ని అడిగారు అని,వారికి ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆశీస్సులతో 125 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించి నిర్మాణం ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా నిర్మాణం పూర్తి చేసి ప్రజల చిరకాల కోరిక తీర్చుతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన ఇళ్ళు కోల్పోతున్న 524 కుటుంబలకు ఉచితంగా అత్యాధునిక సదుపాయాలతో నూతన గృహాలను అందజేయడం జరుగుతుంది అని,ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి లాటరీ పద్దతిలో వారికి ఇళ్ళు కేటాయించడం జరిగిందని,త్వరలోనే అందరిని అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నిరుపేదల సంక్షేమం కొరకు వైస్సార్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఇంతలా కష్టపడుతుంటే కేవలం వారి రాజకీయ మనుగడ కోసం టీడీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని దుయ్యబట్టారు. ఇళ్ళు కావాలంటే 60 వేలు కట్టాలి అని తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్నారని అది అవాస్తవం అని ప్రజలు గ్రహించాలని సూచించారు. గతంలో టీడీకో ఇళ్ల కోసమా స్థానిక నాయకులు దళారీలు గా మరి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసారని వారిలో ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లంచాలు ఇస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని నీచ సంస్కృతి టీడీపీ పార్ట్ ది అని,కానీ వైసీపీ ప్రభుత్వం లో అర్హత ఉంటే కులమత పార్టీలకతీతంగా పారదర్శకంగా పధకాల అమలు జరుగుతుంది అని,సచివాలయ,వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందజేస్తూ దేశంలోనే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని కొనియాడారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల వద్దేక్ నేరుగా వచ్చి ఏదైనా సాంకేతిక కారణాల వలన ఎవరికైనా ఏ పధకం అయిన ఆగినట్లైతే వెంటనే సంబందిత సచివాలయ సిబ్బందితో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కును చిలకల తిరుపతి రెడ్డి కి అవినాష్ మరియు సత్యం లబ్ధిదారులకు అందజేశారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికినగర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరియు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ రెడ్డి ప్రజలకు ఉచితంగా ఇళ్ల పంపిణీ కి గాని, నియోజకవర్ఙ్గమ్ లోని సమస్యలుకు పూర్తి సహకారం అందిస్తున్నారు అని అన్నారు . ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ, మరియు కార్పొరేటర్లు, ఇంచార్జిలు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 730

-రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవిన్యూ సదస్సులు.. -గ్రామాల అభివృద్ధిలో రెవెన్యూ సదస్సులు కీలకపాత్ర పోషిస్థాయి : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *