విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కొరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో యువకులు పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం గుణదల నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శేటికం దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా టీడీపీ,జనసేన కార్యకర్తలు తూర్పు నియోజకవర్గ సమనవ్యకర్త దేవినేని అవినాష్ సమక్షంలో వైస్సార్సీపీ పార్టీలో చేరారు. వారందరికి అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అందరికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని భరోసా కల్పించారు.కొత్త పాత నాయకులు అందరూ కూడా ఎలాంటి తారతమ్యలు లేకుండా పార్టీ పటిష్ఠతకు కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 14 వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, యలగంటి చిన్నారావు,సుంకర బుచ్చిరాజు, అత్తిలి తిరుపతి, శీలం ప్రతాప్,లంకలపల్లి శ్రీను, మాత అప్పారావు, జనపాలశ్రీను,ఇజ్జు వెంకన్న,నారాయణ, నాగ భూషణం,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …