అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ యేడాది 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలో సీఎం వైయస్.జగన్ జమ చేసారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం. అర్హత ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఆర్ధిక సాయం ప్రభుత్వం అందిస్తున్నది. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు,వాణిజ్యం (హేండ్‌లూమ్, టెక్స్ టైల్స్) కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, హేండ్‌లూమ్ టెక్స్ టైల్స్ డైరెక్టర్ పి అర్జునరావు, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు, దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ జె విజయలక్ష్మి, తోగాటివీర కార్పొరేషన్ ఛైర్మన్ గెడ్డం సునీత, కుర్నిశాలి కార్పొరేషన్ ఛైర్మన్ బుట్టా శారదమ్మ, లేపాక్షి ఛైర్మన్ బి విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Tags amaravathi
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …