అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామన్నారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలన్నారు. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలన్నారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌డేట్ కావాలన్నారు. భూమి కార్డులను రైతులకు ఇవ్వాలన్నారు. అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలన్నారు. డ్రోన్లు సహా ఇతర టెక్నికల్ మెటీరియల్‌ను అవసరమైన మేర కొనుగోలు చేయండని అధికారులకు సీఎం ఆదేశించారు. అవసరమైన సాప్ట్‌వేర్‌ను సమకూర్చుకోవాలన్నారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వండన్నారు. దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వారికి తగిన శిక్షణ ఇలా అన్ని అంశాలతో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనుకున్న సమయానికి కచ్చితంగా సమగ్ర భూసర్వే అధికారులు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏపీని కచ్చితంగా దేశంలో మొదటి స్ధానంలో అధికారులు నిలబెడతామన్నారు. దేశంలోనే సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని అధికారులు అన్నారు. సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. అలాగే స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లోకూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం అన్నారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో కూడా సమగ్ర సర్వేపై సమీక్ష చేస్తానన్నారు. సమగ్ర సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నిర్దేశించుకున్న గడువు లోగా ప్రాజెక్టు పూర్తి కావాల్సిందేనన్నారు. అధికారులకు సీఎం వైయస్.జగన్ స్పష్టం చేసారు. సర్వే ఆఫ్ ఇండియాతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. వారి సహకారాన్ని కూడా తీసుకొండన్నారు. సర్వే రాళ్లు కొరత లేకుండా చూడాలి భూగర్భ గనులశాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. సకాలంలో వాటిని అప్పగించాలన్నారు సీఎం. నాలుగు ప్లాంట్లులో నవంబరు నుంచి సర్వేరాళ్లు ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు అన్నారు. రోజుకు ఒక్కో ప్లాంట్లు నుంచి 4వేలు చొప్పున రోజుకు 16వేల సర్వేరాళ్లు ఉత్పత్తి చేస్తామని భూగర్భగనులశాఖ అధికారులు అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …