Breaking News

విద్య,వైద్యం,పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…

-ఆహార భధ్రత కింద ఇంటి వద్దకే రేషన్ సరుకులు
-మానవాభివృద్ధి సూచికలు(HDI)అంశంలో ఎపి ముందంజ
-గత రెండేళ్ళలో అనేక సంస్కరణలతో రాష్ట్రా సమగ్రాభివృద్ధికి చర్యలు
-నీతి ఆయోగ్ వర్కుషాపులో సిఎస్ ఆదిత్యానాధ్ దాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్య,వైద్యం,పేదరిక నిర్మూలన,వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా సమాజంలో నెలకొన్న అసమాతనలు,పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.గురువారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21మరియు మల్టీడైమెన్సనల్ పోవర్టీ ఇండెక్స్(MPI)పై రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్కుషాపు జరిగింది. ఈకార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గత రెండేళ్ళలో ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయాలు వంటి అనేక పరిపాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.ఆహార భద్రత కార్యక్రంలో భాగంగా పేదలందరికీ ఇంటివద్దకే రేషన్ సరుకులను అందించే ప్రక్రియను విజయవంతంగా అమలుచేస్తున్నట్టు తెలిపారు.గత ఏడాదిన్నరగా కోవిడ్ పరిస్థితులు నెలకొన్నప్పటికీ విద్య,వైద్యం వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వివిధ పధకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు.మానవాభివృద్ధి సూచికలు సాధనలో దేశంలో ఎపి అన్ని విధాలా ముందంజలో ఉందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో నవరత్నాలు పేరిట అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు.ముందు చూపు గల నాయకత్వం మంచి పరిపాలనా దక్షత కలిగిన యంత్రాంగం సమిష్టి కృషితో రాబోవు రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందని తెలిపారు.నూతన ఐటి,పరిశ్రమల విధానం అమలు,నీతి ఆయోగ్ మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో పయనించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు.
ఈవర్కుషాపులో పాల్గొన్న నీతి ఆయోగ్ ఆడ్వయిజర్ (SDGs) సాన్యుక్తా సమాదార్ (Sanyukta Samaddar)మాట్లాడుతూ ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ఈవిధమైన వర్కు షాపులు పూర్తి చేశామని తెలిపారు.నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీ గా ఈసస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను మానిటర్ చేస్తోందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ 17 సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(SDGs) ఏర్పాటు చేసుకుని వాటిని అధిగమించేందుకు కృషి చేస్తోందని చెప్పారు.ఎస్డిసి ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ 2020 ప్రకారం ఎపి ఆపార్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎస్డిజి 7 అంశంలో లో దేశంలో మొదటి స్థానంలోను,గోల్-14 లైఫ్ బిలో వాటర్ అంశంలో రెండవ స్థానంలోను,ఎస్డిజి 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అంశంలో 4వస్థానంలోను,ఎస్డిజి 5 జెండర్ ఈక్వాలిటీ అంశంలో 5వస్థానం లోను నిలిచిందన్నారు.వివిధ పధకాలు,కార్యక్రమాలకు ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు ఇన్పుట్ అవుట్ ఆధారితంగా ఈసుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధన ఆధారపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.ఇంకా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు(SDGs) సాధనకు సంబంధించి పలు అంశాలపై అడ్వయిజర్ సాన్యుక్తా సమాదార్ అధికారులకు దిశ నిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి జిఎస్ఆర్కె విజయకుమార్ స్వాగతం పలికి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరిట అనేక సంక్షేమ పధకాలను విజయవతంగా అమలుచేస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేయడం జరుగుతోందన్నారు. ఈలక్ష్య సాధనలో భాగంగానే 115 ఇండికేటర్లు,17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు(Sustainable Development Goals)నిర్దేశించుకోవడం జరిగిందని చెప్పారు.అవి 1.పేదరికం లేకపోవడం, 2.జీరో హంగర్,3.గుడ్ హెల్తు అండ్ వెల్ బీయింగ్,4.క్యాలిటీ ఎడ్యుకేషన్,5.జెండర్ ఈక్వాలిటీ,6. క్లిన్ వాటర్ అండ్ శానిటేషన్,7. అపార్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ,8.డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్,9.ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,10. రెడ్యూస్డ్ ఇనిక్వాలిటీస్,11. సస్టయినబుల్ సిటీస్ అండ్ కమ్యునిటీస్,12.సస్టెయినబుల్ కన్జంప్సన్ అండ్ ప్రొడక్షన్,13. క్లైమేట్ యాక్షన్,14. లైఫ్ బిలో వాటర్,15. లైఫ్ ఇన్ ల్యాండ్,16.పీస్,జస్టీస్ అండ్ స్ట్రాంగ్ ఇనిస్టిట్యూషన్లు,17.పార్టనర్ షిప్స్ అని పేర్కొన్నారు.ఈలక్ష్యాల సాధనలో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ కొన్ని విభాగాల డేటా బేస్ అప్ డేట్ కావాల్సి ఉందని విజయకుమార్ చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, టిఆర్ఆండ్బి,విద్యా,స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు, బి.రాజశేఖర్,ఎఆర్ అనురాధ, కాంతిలాల్ దండే పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన అంశాలపై వివరించారు.ఇంకా ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ బృదం సభ్యులు దాస్, జోషి, వివిధ శాఖల కార్యదర్శులు, నోడలు అధికారులు, సిపిఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *