విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని.. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా బియ్యం పంపిణీ పూర్తికావాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానంగా 3 అంశాలపై చర్చించారు. శ్రీకాకుళం కార్డుదారులకి పోర్టబిలిటీపై క్రమంతప్పకుండా రేషన్ అందించవలసినదిగా అధికారులని ఆదేశించారు. ఎక్కడ కూడా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ ఉండకూడదని.. ఐరిస్, వేలిముద్రలు పడని కార్డుదారులకి వాలంటీర్స్ అనుసంధానంతో సరుకులని పంపిణీ చేయవలసిందిగా సూచించారు. అదే విధంగా రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనదారులకి, వాలంటీర్లకు మధ్య సమన్వయం ఖచ్చితంగా ఉండాలన్నారు. అప్పుడే వెహికల్స్ వచ్చే సమయం లబ్ధిదారులకు అర్థమవుతుందని.. తద్వారా రేషన్ సరఫరా సులభతరం అవుతుందన్నారు. ఇదే సందర్బంలో సెప్టెంబర్ 30 కల్లా కార్డుదారులందరూ EKYC పూర్తి చేసుకోవలసిందిగా పిలుపునిచ్చారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 65,535 కార్డుదారులకు ఏ మేరకు రేషన్ పంపిణీ జరుగుతుందో ఆరా తీశారు. 85 % వరకు జరుగుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా.. 95 % పంపిణీ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు కొత్త బియ్యం కార్డుల జారీలో ఆలస్యం కాకుండా చూడాలని అధికారులకు శాసనసభ్యులు సూచించారు. సమీక్షలో సర్కిల్ 2, 3 ఏఎస్ఓ కోమలి పద్మ, సర్కిల్ -1 సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి, ఆర్ఐలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …