-జీఏడీ సెక్రటరీ శశిభూషణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15 వ తేదీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వర్షపునీటిని వెంటనే తొలగించాలని జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఇందిరా గాంధి స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లును అడిషనల్ డీజీ బాగ్చీ, సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరు జె.నివాస్, వియంసీ కమీషనర్ వెంకటేష్, ప్రొటోకాల్ డైరెక్టరు యం . బాలసుబ్రహ్మణ్యం ఇతర ఉన్నతాధికారులుతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జీఏడీ సెక్రటరీ శిశిభూషణ్ మాట్లాడుతూ వర్షం వచ్చిన వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షపు నీటిని వెంటనే తోడించే ప్రక్రియను అధికారులు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ కార్యక్రమం ఉదయం 8.35 గంటలకు ప్రారంభమై 10.40 గం.ల వరకు జరుగుతుందన్నారు. పేరేడ్ ఉదయం 8.35 ప్రారంభమై 10.40 గం. వరకు ఉంటుందని ఉ.8.50 గం.లకు డీజీపి, ఉ.8.55 గం. సీయస్ ఆదిత్యనాథ్ ,ఉ. 8.58 గం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి హాజరవుతారన్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందుగానే పేరేడ్ గ్రౌండ్ కు చేరుకుని వారికి కేటాయించి సీట్లలో ఆశీనులు కావాలన్నారు. వేదిక కుడివైపు ఏర్పాటు చేసిన సింటింగ్ అమరికలో ఏఏలో జిల్లా జడ్జి, బి1లో రాష్ట్ర స్థాయి అధికారులు, బి2 జిల్లా స్థాయి అధికారులు ఆశీనులవుతారన్నారు. అదేవిధంగా వేదికకు ఎడమ వైపున అమర్చిన ఏఏ ప్లస్ సీట్లులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కుటుంబం, రాజ్ భవన్ ప్యామిలీ ఆశీనులవుతారని కలెక్టరు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలుగా ఓఆర్ ఎస్ ప్యాకెట్లను సిద్దం చేసుకోవాలన్నారు. అదేవిదంగా పబ్లిక్ అడ్రస్సింగ్ సిష్టం ఏర్పాట్లు చెయ్యాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యం రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ శర్మ, ఏ ఎస్ రామ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.