విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఫ్రైడే డ్రై డే” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 36వ వార్డ్, 196వ సచివాలయం పరిధిలోని పరిసర ప్రాంతాలలో రామానగర్ (రామకోటి మైదానం) లోని పరిసర ప్రాంతాలలో సందర్శించటం జరిగింది. దోమల కారణంగా మలేరియా డెంగ్యూ మొదలగు వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు తగు సూచనలను స్థానికులకు తెలియజేశారు. దోమలను నివారించే గలిగితే మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు. దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ పూల కుండీలు కింద ఏర్పాటు చేసిన ప్లేట్లు, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, కూలర్లు, మూత లేకుండా ఉంచిన తొట్లు , కుండలు, డ్రమ్ములు మొదలగు వాటిలో దోమలు వృద్ధి చెందుతాయని వివరించారు. కొందరు తమ ఇండ్ల పైకప్పుపై పాత టైర్లు ఉంచడం వల్ల, దాంట్లో వర్షం నీరు చేరి దోమలు వృద్ధి చెందడం గుర్తించి, ఆ పాత టైర్లు తొలగించడం జరిగింది. నీరు నిల్వ ఉంచిన డ్రమ్ముల లో దోమ లార్వా గురించి, తగిన సూచనలు తెలియజేశారు. కనీసం వారంలో ఒక్కరోజైనా నీటి నిల్వలను తొలగించకపోతే, దోమలు గుడ్లు పెట్టి , దోమలు వృద్ధి చెందుతాయని తెలియజేస్తూ దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలు వివరించే కరపత్రాలు పంపిణీ చేశారు. అందరూ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన దోమతెరలను ఉపయోగించవలసిందిగా సూచించారు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని తెలియజేశారు రద్దీ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా కోవిడ్ వచ్చే ప్రమాదం ఉందని, తప్పనిసరిగా అందరూ మాస్కు ధరించడమే కాక, తరచుగా చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండా వి ఎం సి సిబ్బంది యాంటీ లార్వర్ ఆపరేషన్ చేయుచున్నారని, ఫాగింగ్ చేయుచున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావుతో పాటు భాస్కర్ రావు, రమణ, సచివాలయం ఏఎన్ఎం మంజూష తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …