విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్నఇప్పటి పరిస్థితుల్లో ప్రతివారూ మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని, దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ మొదలగు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు సుపరిచితుడు. గతంలో లాక్ డౌన్ సమయంలో నుండి ఇప్పటివరకు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక పేద కుటుంబాలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు తీసుకోవడం పై చేతనైనంతలో సాయం చేస్తూ ఉద్యోగధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కొప్పాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి విపత్కర పరిస్థితిలో దేవుని దయ వలన, అందరి సమిష్టి కృషి వలన పేదలకు, కరోనా బాధితులకు సేవలందించడంలో చేతనైనంతలో సాయం చేస్తున్నానన్నారు. వీలైనంతవరకూ ప్రతి వారు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించి తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా వారు ఉండాలని, బయటకు అవసరమైతే తప్పితే ఇంటి వద్దే క్షేమంగా ఉంటూ పెద్దలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిదన్నారు.. అందుబాటులో వున్నపేదవారికి ఉచితంగా కోవిడ్ మందుల కిట్టు పంపిణీ చేస్తున్నామన్నారు. మూగ జీవాలను కాపాడాలని, చెట్లను మన వదిలే కార్బన్‌డైయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ మనకు విడుదల చేస్తున్న ప్రాణ సంజీవిని చెట్లు. అటువంటి వాటిని కాపాడుకుందాం. మనం చెట్లు నాటి భావితరాల వారికి చెట్ల నీడను కల్పిద్దామన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, ప్రజలు సమిష్టి పోరాటంతోనే కరో నా కట్టడి చేయగలుగుతామని అదే మనందరి ప్రధమ కర్తవ్యమన్నారు. దోమలను నివారించే గలిగితే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, జ్వరాలు లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు. అందరూ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన దోమతెరలను ఉపయోగించవలసిందిగా సూచించారు. ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని, నీటిని మూతలు లేకుండా నిల్వ చేయరాదని, పూల కుండీలు కింద నీరు చేరకుండా చూడాలని, కొబ్బరిచిప్పలలో వర్షంనీరు చేరకుండా చూడాలని, విరిగిన కుండలు మొదలగు వాటిలో నీరు చేరటం వల్ల దోమలు వృద్ధి చెందుతాయని అలా లేకుండా చూడాలని సూచించారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అవగాహన కోసం ప్రభుత్వ ఆదేశాలమేరకు ప్రతివారం వివిధ ప్రాంతాలలో “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …