-కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం గూడూరు మండలంలో గూడూరు సిహెచ్ సి ఆవరణలో మరియు చిట్టి గూడూరు గ్రామం వద్ద జగనన్న పచ్చతోరణం పధకం అమలులో భాగంగా అవెన్యు ప్లాంటేషన్ కార్యక్రమ ఏర్పాట్లు అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న జగనన్న పచ్చతోరణం ప్రారంభిస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఉన్నతాధికారులు జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రారంభించి మొక్కలు నాటుతారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా డ్వామా పిడిని కలెక్టర్ఆదేశించారు. సిహెచ్ సి ఆవరణలో డయాస్ ఏర్పాటు చేయాలని అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం జిల్లాలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరుగుతుందని, ఈ కార్యక్రమం అమలులో జిల్లా ముందంజలో ఉంటుందని భావిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గూడూరు పిచ్ సి ఆవరణలో మొక్కలు నాటుటకు మరియు జాతీయ రహదారి డివైడర్ పై బోగన్ విల్లియా మొక్కలు నాటుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డ్వామా పిడి తెలియజేశారు. రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమీషనర్ భవాని, సహాయ కమీషనర్ శివప్రసాద్, డ్వామా పిడి జి.వి. సూర్యనారాయణ, ఎంపిడివో వెంకటేశ్వరరావు, తహసిల్దారు దుర్గా ప్రసాద్, ఆయా గ్రామాల సర్పండ్లు సంబంధిత అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.