నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజనల్ లెవల్ అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడి హెల్పర్స్ సెలక్షన్ కమిటీ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మీ అధ్యక్షతన డివిజన్ లోని 5 అంగన్ వాడి ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడీ హెల్పర్స్ పోస్టులను బర్తీ చేసేందుకు స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో ధరఖాస్తు చేసుకున్నవారికి శనివారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. తిరువూరు ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 2 అంగన్ వాడీ వర్కర్స్ పోస్టులకు 21 ధరఖాస్తులు , 12 అండర్ వాడి హెల్పర్స్ పోస్టులకు 77 ధరఖాస్తులు అందాయని, ఉయ్యూరు ప్రాజెక్టు పరిధిలో ఖాలీగా ఉన్న 4 అంగన్ వాడీ హెల్పర్స్ పోస్టులకు 10 ధఝాస్తులు అంగన్ వాడీ వర్కర్స్ పోస్టులు నిల్) అందాయని, గన్నవరం ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 2 అంగన్ వాడీ వర్కర్స్ పోస్టులకు 6 ధరఖాస్తులు, 14 అంగన్ వాడి హెల్పర్స్ పోస్టులకు 77 ధరఖాస్తులు అందాయని, విస్సన్న పేట ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న 1 అంగన్ వాడీ వర్కర్ పోస్టుకు 4 దరఖాస్తులు, 6 అంగన్ వాడీ హెల్పర్స్ పోస్టులకు 12 ధూస్తులు అందాయని, అలాగే నూజివీడు ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న | అంగన్ వాడీ వర్కర్ పోస్టులు – ధరఖాస్తులు, 16 అంగన్ వాడి హెల్పర్స్ పోస్టులకు 33 దరఖాస్తులు అందాయని ఆర్.డి.ఓ తెలిపారు. మొత్తం ఖాళీగా ఉన్న 6 అంగన్ వాడీ వర్కర్ పోస్టులకు 35 ధరఖాస్తులు, 52 అంగన్ వాడి హెల్పర్స్ పోస్టులకు 179 మంది ధస్తు చేసుకున్నట్లు తెలిపారు. పోస్టుల కొరకు ధరఖాస్తులు చేసుకున్న వారందరికి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇంటర్వ్యూ నిర్వహణలో కమిటీ కన్వీనర్ సిడి ఉమెన్ వెల్ఫేర్ కె. ఉమారాణికి, డిప్యూటీ డి.యంఅండ్ హెచ్ వో . TV, సరేంద్రకృష్ణ, సిడిపివోలు జె. సత్యవతి, సుకన్య, యం. లలిత కుమారి, వెంకటలక్ష్మి, వై.జయలక్ష్మి లు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్ కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి …