న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్-19 (కరొనా వైరస్) వ్యాధి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లో రెండవవిడత వ్యాక్సిన్ శిబిరం నిర్వహించిన ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పి.ఆర్.సి) భావ్నా సక్సేనా మరియు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్.సి) గౌరవ్ ఉప్పల్. ఏ.పీ భవన్ పి.ఆర్.సి మరియు తెలంగాణ భవన్ ఆర్.సి ల సంయుక్త ఆధ్వర్యంలో, నేడు ఏ.పీ భవన్ లోని కందుకూరి కాన్ఫరెన్స్ హాల్ లో ఇరు భవన్ ల అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు రెండవ విడత కోవిడ్-19 టీకా (కోవిషీల్డ్) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 4.30 గం.ల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 117 మందికి టీకా వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ మనోహర్ లోహియా (ఆర్.ఎమ్.ఎల్) కార్డియాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ వ్యాస్, ఏపీ భవన్ వైద్య సిబ్బంది గ్రేస్, జోషి లు వైద్య సహకారం అందించారు.