Tag Archives: delhi

భారత్ టెక్స్ 2024లో పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ పెవిలియన్

-పెట్టుబడిదారులతో చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి కీలక చర్చలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2024 లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రతినిధులు పలు పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరిపారు. రాష్ట్రం అందించే పెట్టుబడి అనుకూల వాతావరణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుకూల విధానాలను హైలైట్ చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ నూతన …

Read More »

సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యం లో క్రీడాంధ్రప్రదేశ్ సాకారం దిశగా అడుగులు

-డిల్లీ పర్యటనలో రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -కేంద్ర కార్మిక ఉపాధి క్రీడ యువజన సర్వీసుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి -ఏప్రిల్ నెలలో ఏపిలో పర్యటించనున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ -రాష్ట్రంలో ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి మద్దతు కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. -రాష్ట్రంలో అన్ని నగరాలలో క్రీడ మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ 280.9 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని కేంద్రానికి మంత్రి రాంప్రసాద్ …

Read More »

2024-25 ఏడాదికి గాను వ్యవసాయ ప్రాసెసింగ్ క్ల‌స్ట‌ర్ల‌కు కొత్త ప్రతిపాదనలు అందలేదు

-కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ స‌హాయ మంత్రి రవ్ నీత్ సింగ్ వెల్ల‌డి -ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ప్రాసెసింగ్ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏడు వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లకు అనుమతి లభించింది. ఎపిలో 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఏ క్లస్టర్‌కూ అనుమతి ఇవ్వలేదు. కానీ, 2022-23లో అనంతపురం జిల్లాలో చరణ్ …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో 340 మొబైల్ వెటర్నరీ యూనిట్లు – రూ84.09 కోట్లు నిధులు మంజూరు

-కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్( లాలన్ సింగ్) వెల్ల‌డి -మొబైల్ వెటర్నరీ యూనిట్లు పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర‌ ప్రభుత్వం మొబైల్ వెటర్నరీ యూనిట్ల (MVUs) సంఖ్యను గణనీయంగా పెంచింది. పశువైద్యశాలలు , డిస్పెన్సరీల స్థాపన పటిష్టత – మొబైల్ వెటర్నరీ యూనిట్ (ESVHD-MVU) ప‌థ‌కం కింద దేశ‌వ్యాప్తంగా పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 4340 యూనిట్లు మంజూరు చేయగా, …

Read More »

ఎపిలో గ‌త ఐదేళ్ల‌లో 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSCs) ఏర్పాటు -ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నైపుణ్య లోటు అధ్య‌య‌నాలు

-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత) శాఖ స‌హాయ మంత్రి జయంత్ చౌధరీ వెల్ల‌డి -ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నైపుణ్య లోటు అధ్యయనాల (Skill Gap Studies) పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేష‌న‌ల్ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ (ఎన్.ఎస్.డి.సి) ఆధ్వ‌ర్యంలో 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (SSCs) స్థాపించ‌టం జ‌రిగింది. 2019 నుండి ఈ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఎపిలో పలు పరిశ్రమల అవసరాన్ని బట్టి నైపుణ్య లోటు …

Read More »

డిల్లీలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తో మంత్రి డోలా భేటీ

-రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కేంద్ర మంత్రులను కోరారు. శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్, సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలేతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమావేశమయ్యారు. ఈ …

Read More »

Revision of divisional jurisdiction under the proposed South Coast Railway zone at Vishakhapatnam by retention of truncated Waltair division

Delhi, Neti Patrika Prajavartha : The Cabinet chaired by Prime Minister, Shri Narendra Modi today gave its ex-post facto approval to the following: i. Partial modification of the earlier decision of the Cabinet dated 28.02.2019 to retain Waltair division in truncated form and rename it as Vishakhapatnam division. ii. Thus, one part of Waltair division, comprising approximately of the sections …

Read More »

ఎపిలో ఎమ్.ఐ.డి.హెచ్ (MIDH) కింద ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య‌ 1033

-కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్ల‌డి -మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ప‌థ‌కం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) కింద 2023-24 ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయాల(మండీలు, రిటైల్ మార్కెట్లు, వెండింగ్ కార్ట్లు) ప్రాజెక్టుల సంఖ్య 608 వుండ‌గా, 2024-25లో ఎమ్.ఐ.డి.హెచ్ ప‌థ‌కం ఎపిలో మంజూరైన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల …

Read More »

మంత్రి నారా లోకేష్ కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రైల్వే ప్రాజెక్టుల‌కు రూ.9,417 కోట్లు కేటాయించినందుకు కేంద్ర ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో స‌మావేశ‌మై ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు ఢిల్లీ విచ్చేసిన విద్య‌, ఐటి శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కి మంగ‌ళ‌వారం విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్వాగ‌తం ప‌లికారు. మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి పుట్టా మ‌హేష్ కుమార్, …

Read More »

ఎపిలోని అంగన్వాడీ కేంద్రాలకు పిఎం సూర్య ఘర్ స్కీమ్ కింద సౌర విద్యుత్ అందించాలి

-కేంద్ర ప్ర‌భుత్వానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సూచ‌న -లోక్ సభలో 377 కింద‌ అంగన్వాడీ కేంద్రాలకు సౌర విద్యుత్ అంశం ప్రస్తావన ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 8,455 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం లేదు. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప‌రిధిని విస్త‌రించి అంగన్ వాడీ కేంద్రాలను ఆప‌థ‌కం కింద‌కు తీసుకువస్తే అంగ‌న్వాడీ కేంద్రాల‌కు నిరంతరం సౌర విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుంది. చిన్నారులకు ప్రాథమిక సౌకర్యాలు, …

Read More »