-రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన పమిడిముక్కల, నేటి పత్రిక ప్రజావార్త :కపిలేశ్వరపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టిన కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. శనివారం పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం, నూతన భవన నిర్మాణం, స్థలం మెరక అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే …
Read More »Daily Archives: April 4, 2026
గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్
-మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో బడ్జెట్ అవుట్ రీచ్ ఈవెంట్ – 2026-27 -నియోజకవర్గాల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ -ఈ నెల 11న జరిగే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :గుంటూరు జిల్లాను సర్వతోముఖాభివృద్ధి పథంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని …
Read More »జనవాణి కార్యక్రమానికి 52 వినతులు స్వీకరణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శనివారం తిరుపతిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 52 వినతులను స్వీకరించారు.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన వినతులు అందాయి. వాటిలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి 11, రెవెన్యూ శాఖకు 13, …
Read More »రాజధానిపై జగన్ ది గంటకో మాట
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావు జగన్ కు మంచి వైద్యమందించాలని వైసీపీ శ్రేణులే గొణుక్కుంటున్నాయి : మంత్రి సవిత పెనుకొండలో రూ.40 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ పూల మార్కెట్ ప్రారంభించిన మంత్రి సవిత . పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : ‘దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే… జగన్ మాత్రం గంటకో మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి అమరావతే రాజధాని అంటారు.. మరోసారి మూడు రాజధానులంటారు… …
Read More »అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విఎంసి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాల వద్దగల అన్న క్యాంటీన్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.టోకెన్ కౌంటర్‌లో ఐదు రూపాయలు చెల్లించి క్యూలో నుంచొని, అక్కడ భోజనానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలను అన్నా క్యాంటీన్ పై వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ తాము కూడా ఆహార నాణ్యత పరీక్షించేందుకు భోజనం చేశారు. అన్న క్యాంటీన్లో వసతులు ఎలా ఉన్నాయి? వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. …
Read More »పాత దుస్తులతో బ్యాగులు… పర్యావరణానికి మేలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు విద్యార్థుల సృజనాత్మక ప్రత్యామ్నాయం రీయూజ్, రిడ్యూస్‌పై అవగాహన పెంపు విద్యార్థుల్లో సృజనాత్మకతకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఉదయం వన్ టౌన్ లో గల మహాత్మా గాంధీ పాఠశాలలో వినియోగించిన పాత దుస్తులతో బ్యాగుల తయారీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు పాత దుస్తులను తమ చేతులతో బ్యాగ్ కుట్టి తీసుకువచ్చిన వారితో మాట్లాడారు. …
Read More »మైలవరం నియోజకవర్గం కేతనకొండలో పీఎం సూర్యఘర్ ప్రచార రథం ప్రారంభం
పీఎం సూర్యఘర్ పథకంపై సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా విస్రృతి ప్రచారం పీఎం సూర్య ఘర్ యూఎల్ఏ (Utility Led Aggrigation) మోడ్ ప్రచారం ప్రారంభం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూర్యాంధ్ర ప్రగతి రథాల ద్వారా ప్రజల్లో సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంపొందిస్తూ ప్రతి ఇంట్లో సూర్యఘర్ వెలుగులు నింపేందుకు పీఎం సూర్యఘర్ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ …
Read More »హస్తకళకు విలువ… జీవితానికి వెలుగు
-సృజనాత్మకతే మహిళల సుస్థిర ఉపాధికి బాట -ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :హస్తకళా రంగం మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన ఆధారంగా నిలుస్తోందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. సంప్రదాయ నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని రూపొందించే హస్తకళా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.శనివారం విజయవాడ రూరల్, గొల్లపూడి డీఆర్‌డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు హస్తకళా ఉత్పత్తులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ …
Read More »లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి
–వేగం మరింత పెరగాలి… ఐకానిక్ ముద్ర కనిపించాలి –నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగులు కాదు… రాజధాని –రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్ –ప్రభుత్వ శాఖలు, అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా చూడాలి -అమరావతి రాజధాని పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు –రాజధానిలో అగ్నిప్రమాదాలపై సీఎం అసంతృప్తి… నిర్మాణ సంస్థలదే బాధ్యతని స్పష్టం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. …
Read More »మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం నిందితులపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై ఆగంతకుడు అత్యాచార యత్నం చేసిన ఘటనలో త్వరితగతిన నిందితుణ్ని అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు …
Read More »
Prajavartha Online Telugu News