Breaking News

మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం నిందితులపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై ఆగంతకుడు అత్యాచార యత్నం చేసిన ఘటనలో త్వరితగతిన నిందితుణ్ని అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు అధికారులు వివరించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఘటనకు సంబంధించి కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పాలని సీఎం ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *