Breaking News

Daily Archives: April 28, 2026

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలం లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రికి  దేవస్థాన అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఆలయంలోని కప్ప స్తంభం వద్ద సంప్రదాయం ప్రకారం సీఎం మొక్కులు చెల్లించారు. ముఖ్యమంత్రి వెంట కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్

-ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు… ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు… -స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌కు గూగుల్ క్లౌడ్ సహకారం -గూగుల్ రాకకు లోకేష్ చొరవ చూపారు… ప్రధాని సహకరించారు -పెట్టుబడుల్లోనే కాదు… ప్రాజెక్టుల గ్రౌండింగులోనూ ఏపీనే నెంబర్-1 -గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -జూన్ 1న విశాఖ రైల్వేజోన్‌కు నోటిఫికేషన్ ఇస్తామన్న రైల్వేమంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీఎం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే …

Read More »

వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

-ఈస్ట్-వెస్ట్ రైల్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయండి -ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -పోర్టుల కనెక్టివిటీకి ప్రధమ ప్రాధాన్యత- రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ -దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం సందర్శించిన సీఎం, రైల్వే మంత్రి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసేందుకు ప్రత్యేక కంటైనర్ రీఫర్ రైళ్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖను కోరారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన రైలు …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా. రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని… నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని చెప్పిన అధికారులు. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయానికి 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపిన అధికారులు. గత అర్థరాత్రి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు …

Read More »

రబీ కోతల కీలక దశలో డీజిల్ సరఫరాపై అలర్ట్

– 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ – వర్షాల హెచ్చరిక మధ్య పంట రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు… అధికారులకు మంత్రి ఆదేశాలు – హార్వెస్టర్లకు డీజిల్ ప్రాధాన్యం… రైతులకు నష్టం లేకుండా సమగ్ర చర్యలు – అధిక డిమాండ్ జిల్లాల్లో అదనపు ట్యాంకర్లు, సరఫరా అంతరాయం ఉండకూడదని మంత్రి స్పష్టం – ఫీల్డ్‌లో అధికారులు తప్పనిసరి… రైతులకు సకాలంలో గైడెన్స్ ఇవ్వాలి – డీజిల్ సరఫరా, పంట రక్షణపై ప్రభుత్వం పూర్తి దృష్టి – మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, …

Read More »

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ & కెమికల్ డిజాస్టర్ పై మాక్ ఎక్సర్‌సైజ్

-15 జిల్లాల్లోని 22 పరిశ్రమల్లో మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణ -జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల మార్గదర్శకాల ప్రకారం అమలు -ప్రమాద సమయంలో ప్రాణ-ఆస్తి నష్టం తగ్గించే చర్యలపై శిక్షణ, సమన్వయం -విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకారంతో మే నెల మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా కెమికల్ మరియు ఆయిల్ డిజాస్టర్స్‌పై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నట్లు …

Read More »

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మంగళవారం మార్కాపురం జిల్లా కంభం, వైఎస్సార్ కడప(జి) ఒంటిమిట్టలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 140 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. బుధవారం (29-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం …

Read More »

ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక లేఖ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అత్యవసర లేఖ రాసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ సీజన్ 2025-26లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి సుమారు 4.83 లక్షల హెక్టార్లలో 37.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్ ధరలు కనీస మద్దతు …

Read More »

ఉత్తరాంధ్రలో రాబోయే రెండేళ్లలో 11 కీలక ప్రాజెక్ట్లు పూర్తి

-తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడమే లక్ష్యం. -కరువుప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. -ఉత్తరాంధ్రప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రెండేళ్లలో 2000 కోట్లు ఖర్చు చేసి ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించినట్లు జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …

Read More »

ఆక్వాకల్చర్‌కు అండగా కూటమి ప్రభుత్వం

– డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు – జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నిరంతర పర్యవేక్షణ – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వాకల్చర్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,34,617 హెక్టార్లలో ఆక్వాకల్చర్ సాగు జరుగుతోందని, అందులో 1,21,829 హెక్టార్లలో చేపల పెంపకం, 1,12,788 హెక్టార్లలో ఉప్పునీటి సాగు జరుగుతోందని పేర్కొన్నారు. శ్రింప్, సీ బాస్ వంటి …

Read More »