Breaking News

పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
టెలికాన్ఫరెన్సులో పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా. రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని… నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని చెప్పిన అధికారులు. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయానికి 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపిన అధికారులు. గత అర్థరాత్రి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు 2173 కిలో లీటర్ల పెట్రోల్, 2846 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని తెలిపిన అధికారులు. స్టాక్ లేని బంకుల సంఖ్య ఎంత మేర ఉందని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి… నిన్నటితో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయని చెప్పిన అధికారులు. ప్రస్తుతం జిల్లాల నుంచి వస్తోన్న సమాచారం మేరకు ఉదయం 6 గంటల నాటికి 432 బంకులు మినహా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత ఉందన్న అధికారులు. పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరేంత వరకు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలని సీఎం ఆదేశం. క్యూలైన్లు లేకుండా చూడాలన్న సీఎం.. అవసరమైతే టోకెన్, స్లాట్ సిస్టంలను అవలంభించాలని ముఖ్యమంత్రి సూచన.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *