అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి …
Read More »Daily Archives: April 18, 2026
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌లలో సచివాలయాల పనితీరు, సిబ్బంది గైర్హాజరు, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యంపై ప్రజల నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం రామవరప్పాడు-1, 2, 3, ప్రసాదంపాడు-2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ తనిఖీలలో సచివాలయ వ్యవస్థలోని లోపాలను ఆయన గుర్తించారు. తనిఖీ సమయంలో పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరు కావడాన్ని ఎమ్మెల్యే …
Read More »స్వచ్ఛ బందరుని సాకారానికి ప్రజలంతా కలిసి రావాలి
– ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది – ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా పరిశుభ్రత పాటించాలి – ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించేలా అధికారులు కృషి అభినందనీయం – జలధార-జల హారతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్యి పరిశుభ్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, అందులో భాగంగానే ప్రతి నెలా మూడో శనివారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ …
Read More »విద్యాధరపురంలో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాధరపురం లో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన వచ్చింది… పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 38, 39 డివిజన్ల ప్రజల కోసం స్థానిక గుప్తాసెంటర్ లోని షాదీఖానా వద్ద సుజనా మొబైల్ క్లినిక ల ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స …
Read More »గన్నవరంలో హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
-మైనార్టీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది -పవిత్ర హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది -పచ్చ జెండా ఊపి హజ్ యాత్రను ప్రారంభించిన మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూఖ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనార్టీ సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తూ, జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే హజ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయం నుండి …
Read More »గన్నవరంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
-రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా మార్చడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు -ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. ప్రతి ఎకరాను సాగులోకి తీసుకొద్దాం -ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ లక్ష్యాలు సుసాధ్యమవుతాయి -గన్నవరం నియోజకవర్గం చిన్న అవుటపల్లిలో ఉపాధి హామీ కూలీల సమక్షంలో కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం చిన్న అవుటపల్లిలో ఎమ్మెల్యే …
Read More »చాక్‌పీస్ (సుద్దముక్క)పై స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, సీఎం చంద్రబాబు పుట్టిన రోజు తేదీ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చాక్‌పీస్ (సుద్దముక్క) పై స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నినాదంతో 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు అని తూర్పుగోదావరి జిల్లా, తీపర్రు, పెరవాలికి చెందిన కోడూరి నాగ రాఘవేంద్రబాబు చెక్కి చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో నిడదవోలు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి ప్రయత్నించినా కలవలేకపోయానని, భవిష్యత్‌లో అయినా అభిమాన నాయకుడిని కలిసి తన నైపుణ్యంద్వారా అభిమానాన్ని చాటుకోవాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు.
Read More »ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు ఐఎస్‌వో కీర్తి కిరీటం
– మూడు సర్టిఫికేట్లు కైవసం చేసుకున్న కలెక్టరేట్ – అత్యుత్తమ ప్రమాణాలు పాటించిన 9 పంచాయతీలకు కూడా ఐఎస్‌వో సర్టిఫికెట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికేషన్‌లు లభించాయి. పరిపాలనా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, ప్రజా సేవల మెరుగుదలలో తీసుకున్న చర్యలకు గుర్తింపుగా మూడు ఐఎస్‌వో సర్టిఫికేట్లు కలెక్టరేట్‌కు అందాయి. ఇంధన పొదుపు విధానాలు, హరిత, పర్యావరణ హిత ప్రోత్సాహక కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో సత్వర స్పందన, సంక్షేమ పథకాల అమలు …
Read More »17 మందికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్బంగా నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో సాంస్కృతిక వారసత్వాన్ని సంగీతంతో సెలబ్రేట్ చేసే హెరిటేజ్ హార్మొనీ కార్యక్రమంలో మొత్తం 17 మందికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు ప్రదానం చేశారు. క్రీడలు, యోగా, ధార్మికత, వైద్యం, వ్యవసాయం, తెలుగు సాహిత్యం, సంగీతం తదితర రంగాల్లో మన ఘన వారసత్వానికి ప్రతీకలుగా నిలిచిన విశిష్ట వ్యక్తులకు లివింగ్ హెరిటేజ్ అవార్డులు ప్రదానం చేశారు.
Read More »KDCC బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ – నాణ్యతలో అగ్రగామిగా కొత్త గుర్తింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC Bank) సేవల నాణ్యతలో విశేష ప్రగతి సాధిస్తూ మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకుంది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (International Organization for Standardization – ISO) నుంచి ISO 9001:2015 సర్టిఫికేషన్ పొందడం ద్వారా బ్యాంక్ తన నాణ్యతా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకుంది. ఈ సర్టిఫికేషన్‌ను ఈ రోజు KDCC బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ISO …
Read More »
Prajavartha Online Telugu News