Breaking News

విద్యాధరపురంలో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాధరపురం లో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన వచ్చింది… పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 38, 39 డివిజన్ల ప్రజల కోసం స్థానిక గుప్తాసెంటర్ లోని షాదీఖానా వద్ద సుజనా మొబైల్ క్లినిక ల ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , అల్ట్రా స్కానింగ్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.. శంకర్ నేత్ర చికిత్సాలయం వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి టీమ్ మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు… అదే విధంగా సిద్దార్ధ దంత వైద్య కళాశాల దంత వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట రమణ, కిరణ్ , హరీష్ లతో పాటు 39 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు సాయి శరత్, 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు తమ్మిన లీల కరుణాకర్ , బిజెపి 39వ డివిజన్ అధ్యక్షుడు పచ్చిపులుసు శివప్రసాద్, 39వ డివిజన్ టిడిపి పార్టీ అధ్యక్షులు కప్పగంతు శివశర్మ, 38వ డివిజన్ టిడిపి అధ్యక్షులు సురభి బాలు , మాజీ కార్పొరేటర్లు నరేంద్ర రాఘవ, మైలవరపు దుర్గారావు, అప్పాజీ,
సుజనా మిత్ర కోఆర్డినేటర్లు. పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *