Breaking News

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సింహాచలం లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రికి  దేవస్థాన అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఆలయంలోని కప్ప స్తంభం వద్ద సంప్రదాయం ప్రకారం సీఎం మొక్కులు చెల్లించారు. ముఖ్యమంత్రి వెంట కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *