Breaking News

కేంద్ర రోడ్లు, రవాణా & హైవే శాఖ (MoRTH) సెక్రటరీతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భేటీ

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 

కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం – రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఏపీలో NH ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరు, విస్తరణ పనుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా & హైవే శాఖ సెక్రెటరీ ఉమాశంకర్ ను కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరడం జరిగింది..

నేడు ఢిల్లీలో కేంద్ర రోడ్లు, రవాణా మరియు హైవే శాఖ (MoRTH) కార్యాలయంలో ఆ శాఖ సెక్రటరీ ఉమాశంకర్ టీ.. ఆర్ & బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. టి. కృష్ణబాబుతో కలిసి సమావేశం కావడం జరిగింది.. అనంతరం ఆయనకు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది..

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై MoRTH సెక్రటరీతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చర్చించడం జరిగింది.. ఈ సందర్భంగా ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి కోరారు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి జాతీయ రహదారుల పనుల పెండింగ్ సమస్యలైన భూసేకరణ, అటవీ క్లియరెన్స్, రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ జాతీయ ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో 2 లేన్ల రహదారిని రూ. 60 కోట్లతో 4 లేన్లగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.. నూతన ప్రతిపాదనలకు అనుమతులు, పెండింగ్ సమస్యల పరిష్కారంపై MoRTH సెక్రటరీ సానుకూలంగా స్పందించడం జరిగింది..

అదే సమయంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన జాతీయ రహదారి ప్రాజెక్టుల మంజూరు, అమలును వేగవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, MoRTH సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చిన ప్రధాన ప్రాజెక్టులు :

•   NH-165 లో ఆకివీడు నుండి దిగమర్రు వరకు ఫోర్-లేనింగ్ పనులు

•   NH-216 లో కిమీ 32 నుండి అమలాపురం – రావులపాలెం వరకు ఫోర్-లేనింగ్ పనులు

•   NH-216 H లో పెడన నుండి లక్ష్మీపురం వరకు అభివృద్ధి పనులు

•   NH-365 BB లో కిమీ 26 నుండి 45 వరకు పేవ్డ్ షోల్డర్లతో టూ-లేన్‌గా అభివృద్ధి

•   NH-42 లో ముదిగుబ్బ నుండి కదిరి వరకు ఫోర్-లేనింగ్ పనులు

•   NH-716 లో ముద్దనూరు నుండి కడప వరకు ఫోర్-లేనింగ్ పనులు

•   NH-40 లో కడప – రాయచోటి విభాగంలో ఫోర్-లేన్ టన్నెల్ నిర్మాణం

•   NH-40 లో చిత్తూరు పట్టణ పరిధిలో బైపాస్ రహదారి అభివృద్ధి

•   NH-544D లో బుగ్గ నుండి కైప వరకు రహదారి అభివృద్ధి / అప్‌గ్రడేషన్ పనులు

•   NH-167K లో నల్లకాలువ నుండి వెలుగోడు వరకు అప్‌గ్రడేషన్ పనులు మరియు మొదలైన పనులు.

ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రాంతీయ అభివృద్ధి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, MoRTH ప్రాంతీయ అధికారి హరికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *