Breaking News

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌
-రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు
-య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, అనంత‌పురంలో ఒక‌ర్ని క‌నిపెట్టిన కెమెరాలు
-త‌ప్పిపోయిన చిన్నారుల‌ను త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించిన పోలీసులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌ర్వైలెన్సు కెమెరాలు ప్ర‌జా భ‌ద్ర‌త‌కూ భ‌రోసా క‌ల్పించే దిశ‌గా కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. ఇంటి నుంచి త‌ప్పిపోయిన చిన్నారుల ఆచూకీ క‌నిపెట్టి, వారిని వారి కుటుంబస‌భ్యుల‌కు అప్ప‌గించ‌డంలో ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీ360 వ్య‌వ‌స్థ పోలీసుల‌కు కీల‌క స‌హ‌కారం అందిస్తోంది. రోజుల వ్యవ‌ధిలోనే ఇలా తప్పిపోయిన ముగ్గురు చిన్నారుల ఆచూకీ క‌నుగొన‌డంలో పోలీసుల‌కు సీసీటీవీ360 వ్య‌వ‌స్థ స‌హ‌కరించి ఆ పిల్ల‌ల‌ను వారి కుటుంబ‌స‌భ్యుల చెంత‌కు మ‌ళ్లీ చేరేలా తోడ్పాటు అందించింది.

అన‌కాప‌ల్లి జిల్లా య‌ల‌మంచిలి ప‌ట్ణ‌ణంలో త‌ప్పిపోయిన ఇద్ద‌రు బాలుర‌ను ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 స‌హ‌కారంతో పోలీసులు రియ‌ల్ టైములో ప‌ట్టుకుని ఆ పిల్ల‌ల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించిన సంఘ‌ట‌న ఇది.
ఒక ప్రైవేటు పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ఈ ఇద్ద‌రు బాలురు స్నేహితులు. వీరు క‌నిపించ‌కుండా పోయార‌ని 15వ తేదీ య‌ల‌మంచిలి పోలీసుల‌కు వారి త‌ల్లిండ్రుల నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన పోలీసులు వీరి ఆచూకీ క‌నుగొన‌డానికి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు సీసీ కెమెరాల ద్వారా వీరి ఆచూకీని క‌నుగొని స‌హ‌కారం అందించాల‌ని పోలీసులు ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీ360 విభాగాన్ని కోరారు. త‌ప్పిపోయిన బాలుర‌కు సంబంధించి పోలీసులు ఇచ్చిన ఫొటోల‌ను ఆర్టీజీఎస్ సీసీటీవీ360లో అప్ లోడు చేశారు. వీటిని ఏఐ ఆధారిత సీసీకెమెరాల ద్వారా విశ్లేషిస్తూ ఈ బాలుర క‌ద‌లిక‌ల‌ను రియ‌ల్ టైములో ట్రాక్ చేసి క‌నుగొన్నారు. ఈ ఇద్ద‌రు విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో ఉన్న‌ట్లుగా అక్క‌డి సీసీ కెమెరాలు గుర్తించి ఆర్టీజీఎస్ సీసీటీవీ360 ద్వారా పోలీసుల‌కు రిల‌య్ టైములో అల‌ర్టులు పంపాయి. విశాఖ‌న‌గ‌రంలో వీరిద్ద‌రు ఫ‌లాన చోటున ఉన్నార‌నే స‌మాచారం అందించాయి. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై అక్క‌డికి చేరుకుని ఆ ఇద్ద‌రు చిన్నారుల‌ను ప‌ట్టుకుని వారిని వారి కుటుంబ స‌భ్య‌ల‌కు తిరిగి అప్ప‌గించారు.

అనంత‌పురంలో జిల్లాలోనూ ఇలాగే త‌ప్పిపోయిన బ‌లుడ్ని ఆర్టీజీఎస్ సీసీటీవీ360 సాంకేతిక స‌హ‌కారంతో పోలీసులు స‌కాలంలో ప‌ట్టుకుని అత‌డ్ని వారి కుటుంబ స‌భ్య‌ల‌కు తిరిగి అప్ప‌గించ‌గ‌లిగారు. అనంత‌పురం ప‌ట్ట‌ణంలో త‌మ బిడ్డ త‌ప్పిపోయాడ‌ని బాలుడి త‌ల్లిదండ్రులు ఈ నెల 11న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ పిల్లాడి ఆచూకీ క‌నుగొన‌డానికి ఆర్టీజీఎస్ సీసీటీవీ360 విభాగం స‌హ‌క‌రాం కోరారు. ఆ పిల్లాడికి సంబంధించిన ఫొటోని ఆర్టీజీఎస్ సీసీటీవీ360లో అప్‌లోడు చేసి ఆ పిల్లాడి క‌ద‌లిక‌ల‌ను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేశారు. సీసీటీవీ360లోని ప‌ర్స‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పీఓఐ) సాంకేతిక విశ్లేష‌ణ ద్వారా ఆ బాలుడు హైద‌రాబాద్‌వైపు వెళుతున్నాడ‌ని ఆర్టీజీఎస్ రియ‌ల్ టైము అల‌ర్టుల‌ను పోలీసుల‌కు అంద‌జేసింది. దీంతో పోలీసులు స‌కాలంలో ఆ బాలుడ్ని ప‌ట్టుకుని వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించ‌గ‌లిగారు.

స‌త్ఫ‌లితాలిస్తున్న సాంకేతిక‌త‌

ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీ360 విభాగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్సు సాంకేతిక త‌ప్పిపోయిన వారి ఆచూకీ క‌నుగొన‌డంలో స‌త్ఫ‌లితాలు సాధిస్తోంది. అలాగే రాష్ట్రంలో నేర‌స్థుల‌ను, చోరీకి గురైన వాహ‌నాల ఆచూకీ కనుగొన‌డానికి కూడా ఇప్పుడు పోలీసులు ఈ సాంకేతిక స‌హ‌కారాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. కేసుల ద‌ర్యాప్తులో పోలీసుల‌కు అవ‌స‌ర‌మైన సాంకేతిక స‌హ‌కారం అందిస్తూ ఆర్టీజీఎస్ సీసీటీవీ360 విభాగం స‌త్ఫ‌లితాలు సాధిస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo

-జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ పరికరాల సిద్ధం -సౌండ్ ప్రూప్ రూములు కూడా.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *